ఉమ్మడి నల్గొండ జిల్లాలో బకాయి సొమ్ములు అందక ధాన్యం రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పినా.. నెలలు గడుస్తున్నాయి. తమ డబ్బులెప్పుడు వస్తాయోనని ధాన్యం అమ్మిన రైతులు ఎదురు చూస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ధాన్యం రైతులు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా 461 మంది రైతులకు సుమారు కోటి 25 లక్షలు చెల్లించాల్సి ఉంది కొనుగోలు కేంద్రాలు. డిసెంబర్ 25 నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తి…