Bala Veeranjaneya Swamy: ప్రకాశం జిల్లా కొండేపిలో ఎస్సై రమేష్ బాబుపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి.. దళితుల పట్ల జగన్ మొసలి కన్నీరు కార్చుతున్నారు. గంజాయి బ్యాచ్ పై పోలీసులు చర్యలు తీసుకోవడం తప్పా జగన్ ? అని నిలదీశారు.. నేరస్తులను ప్రోత్సహించి జగన్ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు ? అని ఎద్దేవా చేశారు.. రౌడీలకు, గూండాలకు కులాలు అంటగట్టి రాజకీయం చేస్తారా ?, వైసీపీ పాలనలో దళితులపై హత్యలు, అత్యాచారాలు జరిగితే జగన్ ఎందుకు నోరు మెదపలేదు?, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీపై జగన్ ఏం చర్యలు తీసుకున్నారు ?, కనీసం సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శించారా?, మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని చంపిన పాపం మీది కాదా ?, జగన్ సొంత నియోజకవర్గంలో అత్యాచారానికి గురైన దళిత మహిళ నాగమ్మ కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదు? అంటూ నిలదీశారు..
Read Also: RCB vs PBKS: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ ఫైనల్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
ఇక, ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి హింసించిన చరిత్ర జగన్ ది.. నాడు అనంతపురం జిల్లాలో దళిత సిఐ ఆత్మహత్యకు కారణం ఎవరు? ఆ సిఐ కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదు? అని ప్రశ్నించారు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి.. వైసీపీ హయాంలో దళిత మహిళలపై దాడుల్లో రాష్టాన్ని దేశంలోనే మెదటి స్థానంలో నిలిపిన ఘనత జగన్ దేనన్న ఆయన.. కొండపిలో దళిత ఎస్సై విధి నిర్వహణకు వైసీపీ కార్యకర్తలు అడ్డుపడి దానిపైనా తప్పుడు ప్రచారం చేస్తారా? వైసీపీ హయాంలో దళితులపై దాడులు చేసిన వారంతా వైసీపీ కార్యకర్తలు, నాయకులే అన్నారు.. జగన్ నాడు వారిపై ఏం చర్యలు తీసుకున్నారు ? జగన్ మాయ మాటలు దళితులు నమ్మే పరిస్థితి లేదు. దళితుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని స్వామి మండిపడ్డారు..