పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. లా అండ్ ఆర్డర్ కాపాడుకుంటూ హక్కుల్ని కాపాడుకుంటూ ప్రజలకి భద్రత కల్పిస్తున్నారు.. వైసీపీ నేతలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు.. ఈ రోజు దాదాపుగా 100 కోట్లకుపైగా ఖర్చు పెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు..
ప్రకాశం జిల్లా కొండేపిలో ఎస్సై రమేష్ బాబుపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి.. దళితుల పట్ల జగన్ మొసలి కన్నీరు కార్చుతున్నారు. గంజాయి బ్యాచ్ పై పోలీసులు చర్యలు తీసుకోవడం తప్పా జగన్ ? అని నిలదీశారు.
దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అందులో భాగంగా రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
Bala Veeranjaneya Swami: పేర్ని నాని, వైఎస్ జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వాళ్ల లాగా 11 సీట్లకు పరిమితం కావాల్సిన అవసరం మాకు లేదు.. పేర్ని నాని భార్య గోడౌన్ లో రేషన్ బియ్యం మాయమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరేషన్‌పై ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను ఇచ్చింది.. ఈ అంశానికి సంబంధించి కసరత్తు కూడా జరుగుతోంది... గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకు వెళ్లారు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ నేతలు.. ఈ రోజు మంత్రి డోలతో సమావేశమైన ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ నేతలు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు..
గులియన్ బారే సిండ్రోమ్.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జీబీఎస్ వ్యాధితో మహిళ మృతి చెందింది. ప్రకాశం జిల్లాలోని అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. జీబీఎస్ వ్యాధితో ప్రకాశం జిల్లా మహిళ మృతి చెందిన ఘటనపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పందించారు. జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. Also…
అధికారంలో ఉన్నపుడు.. ఇప్పుడు వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి. గత ప్రభుత్వం వసతి దీవెన పథకానికి కేటాయించిన నిధులు 50 శాతానికి మించి ఎప్పుడైనా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. దానికి రికార్డులు కావాలన్నా ఇస్తామన్నారు..
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన హామీకి ఎన్‌డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.