గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణలేటెస్ట్ సినిమా ‘డాకు మహారాజ్’. సూపర్ హిట్ సినిమాలు దర్శకుడు బాబీ కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకోగా ట్రైలర్ కు అటు ఫ్యాన్స్ నుండి ఇటు సినీ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే ఈ చిత్రంలో అన్ని సాంగ్స్‌కు విశేషంగా ఆకట్టుకోగా ఒక సాంగ్ మాత్రం కాంట్రవర్సీకి కేంద్ర బిందువైంది.
ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భామతో కలిసి బాలయ్య చేసిన ‘దబిడి దిబిడి’ సాంగ్ రిలీజ్ అయ్యాక నెగిటివ్ ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరిగింది. ఈ సాంగ్‌లో ఊర్వశి రౌతేలాతో బాలయ్య వేసిన స్టెప్పులు విమర్శలకు దారితీసింది. ఆ విమర్శలపై తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ స్పందించారు. ఓ మీడియా ఛానెల్ తో డాకు మహారాజ్ విశేషాలను పంచుకుంటూ ‘ఆ సాంగ్ షూట్ టైమ్ లో చూసాను, లిరికల్ సాంగ్ చేసినప్పుడు చూసా, సీజీ అప్పుడు సాంగ్ చూసా నాకు ఎప్పుడు సాంగ్ అంత హార్డ్ గా అనిపించలేదు. బాలయ్య ఎమ్మెల్యే అనే ఇమేజ్ మూలంగా అలా నెగిటివ్ గా చూసారా అని అర్ధం కాలేదు. బాలకృష్ణ సినిమాలో ఊరమాస్ ఎలిమెంట్ ఉండాలి అనుకున్నాం. సినిమా అంతా స్టైలిష్ గా చేసి ఊరమాస్ ఎలిమెంట్ ను సాంగ్ లో సెట్ చేసాం. కొందరు నెగిటివ్ కామెంట్స్ చేసినా ఎంజాయ్ చేసే వాళ్ళు బాగా ఎంజాయ్ చేసారు’ అని అన్నారు.