Sattenapalle: వైసీపీ మాజీ మంత్రులు విడదల రజినీ, అంబటి రాంబాబు నేడు (జూలై 21న) సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకానున్నారు. రెంటపాళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్న సమయంలో అంబటి రాంబాబు అడ్డుపడ్డారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసులో ఇవాళ విచారణకు రావాలని ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగే, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆయనను ప్రశ్నించనున్నారు.
Read Also: IND vs ENG: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. నితీశ్ రెడ్డి అవుట్!
ఇక మరోవైపు, వైఎస్ జగన్ పర్యటన సమయంలో విధించిన నిబంధనలను ఉల్లంఘించిన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి విడదల రజినీపై కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఆమెను కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో పోలీసులు తగిన ఆధారాలతో ఎంక్వైరీ చేయనున్నారు. ఈ విచారణల నేపథ్యంలో సత్తెనపల్లిలో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.