Onion Prices Down: ఉల్లి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీకావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉల్లి లేకుండా కూరలు పూర్తి కావు.. ఒకప్పుడు ఉల్లి ధరల కారణంగా ప్రభుత్వాలు పతనం అయిన సందర్భాలు అనేకం. కిలో సెంచరీలు దాటిన ఉల్లితో మహిళలు ప్రభుత్వాలపై శాపనార్ధాలు పెట్టారు. తాజాగా ఉల్లి ధర పతనం అయింది. ఎంతగా అంటే గతంలో ఉల్లి కొనలేక కన్నీళ్ళు వస్తే.. ఇప్పుడు ఉల్లి అమ్మేందుకు అవకాశం లేక… గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ధర పతనమైంది. ఎప్పటిలాగే రైతు పండించిన పంట మార్కెట్ కు రాగానే ధర పడిపోయింది. ధర లేకపోవడంతో పంటకోసి మార్కెట్ లో అమ్మితే వచ్చే నష్టం భరించడంనకంటే పంట దున్నేస్తే తక్కువ నష్టం వస్తుంది. కొందరు రైతులు పండించిన పంటనే దున్నేస్తున్నారు. మరికొందరు ఎంతో కొంత వస్తుందన్న ఆశతో మార్కెట్ కు తీసుకువెళ్లి నష్టపోతున్నారు.
ఉల్లి ధర పతనం రైతుల్ని బాగా ఇబ్బందిపెడుతోంది. అప్పులు చేసిన మరీ ఉల్లి సాగుచేశారు వేలాదిమంది రైతులు. ఇప్పుడు ఉల్లి గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలంలోనే పంటను తొలగిస్తున్నారు. దేవనకొండ మండలంలో ఓ రైతు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని 4లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి సాగు చేసాడు. పండిన ఉల్లిన కోసి, గ్రేడింగ్ చేసి, ట్రాక్టర్ లో మార్కెట్ కు తరలిస్తే కూలీలు, రవాణా ఖర్చు కనీసం 3 లక్షలు వ్యయం అవుతుంది. మార్కెట్ లో సరుకు అమ్మితే 2 లక్షలు కూడా చేతికి రాదు. దీంతో ఉల్లి పంటను 12 వేలు ఖర్చు పెట్టి ట్రాక్టర్ తో దున్నించాడు. కూలీలు, ఎరువులు, కౌలు మొత్తం ఖర్చులు అప్పు చేసి ఉల్లి సాగు చేస్తే పెట్టుబడి మొత్తం కూడా చేతికి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
Read Also: K.Chandrashekar Rao : దేశంలో మతపిచ్చి ఎవరికి మంచిది.. అంతా బాగుండాలి.. అందులో మనం ఉండాలి
ఇటీవలి కాలంలో వర్షాలు బాగా పడ్డాయి. దీంతో కర్నూలు జిల్లాలో ఉల్లి దిగుబడులు మొదలయ్యాయి. ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డుకు తరలి వస్తోంది. ఉల్లి ధర పడిపోయింది. బహిరంగ మార్కెట్ లో ఉల్లి కిలో 20 నుంచి 30 రూపాయలు ఉంది. అయితే రైతుల నుంచి క్వింటాలు ఉల్లి 400 నుంచి 800 పలుకుతోంది. వినియోగదారులకు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. అంటే రైతు వద్ద కిలో 4 నుంచి 8 రూపాయాలు కొంటున్నారు. ఉల్లి గిట్టుబాటు ధర పడిపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఎకరాకు 75 వేలకు పైగానే ఉందని, ఇప్పటి ధర పెట్టుబడికి కూడా రావడం లేదంటున్నారు రైతులు. దళారులు ఉల్లి ధర రైతులకు దక్కకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.
కర్నూలు జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో లక్ష ఎకరాల వరకు ఉల్లి సాగవుతుంది. ఇతర రాష్ట్రాలకు కర్నూలు జిల్లా నుంచి ఉల్లి ఎగుమతి అవుతుంది. రైతులకు ఎప్పుడో ఒకసారి కానీ మంచి ధర దక్కదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత ధర పడిపోతుందేమోనన్న భయం రైతుల్లో ఉంది. ఇప్పటికే కర్నూలు మార్కెట్ కు 1300 క్వింటాళ్ల ఉల్లి వస్తోంది. కనిష్ట ధర 415 కాగా గరిష్ట ధర 1150 వుంది. గరిష్ట ధర దక్కేది ఏ ఒకరిద్దరు రైతులకు మాత్రమే దక్కుతుంది. మెజారిటీ రైతులకు దక్కేది 500 నుంచి 800 రూపాయల లోపే. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రతి ఏటా రైతులు కోరుతూనే వున్నారు. రైతులు నష్టపోతూనే వున్నారు. ఇప్పటికైనా ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా సరఫరా చేయాలంటున్నారు రైతులు.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..