Atmakur Bypoll : వైసీపీ అభ్యర్థిగా విక్రమ్ రెడ్డి నామినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డిని ఎంపిక చేశారు సీఎం జగన్.
బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్‌తో విక్రమ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ భేటీకి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు.సీఎం జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి ఇవాళ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
మరోవైపు ఆత్మకూరు బరిలో నిలవాలని బీజేపీ నిర్ణయించింది. ఆత్మకూరు ఉప ఎన్నికపై మాకు పూర్తి అవగాహన ఉందన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. జనసేనతో చర్చించిన తర్వాతే పోటీకి సిద్ధం అయ్యామన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నిక అభ్యర్ధి ఎంపికపై బీజేపీ తుది కసరత్తు చేస్తోంది. రవీంద్రారెడ్డి పేరును పరిశీలిస్తోంది పార్టీ అధినాయకత్వం. ఒకటి రెండు రోజుల్లో ఆత్మకూరు ఉప ఎన్నిక అభ్యర్థిపై అధికార ప్రకటన చేయనుంది బీజేపీ. కాంగ్రెస్ కూడా అభ్యర్ధి వేటలో వుంది. టీడీపీ తన పాత సంప్రదాయాన్ని కొనసాగించనుంది. ఆత్మకూరులో ఏకగ్రీవం అనేది జరగకపోవచ్చు. పోటీ అనివార్యం కావడంతో వైసీపీ అభ్యర్ధి విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించేందుకు వైసీపీ మంత్రులు, నేతలు పనిచేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!