Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Buggana Rajendranath 2

Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

Published Date :March 12, 2026 , 9:49 pm
By Gogikar Sai Krishna
  • బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారంటూ సంచలన ఆరోపణలు
  • ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన రైతు రామచంద్ర
  • 110 ఏళ్ళ నుంచి మా కుటుంబం అధీనంలో ఉందని వివరణ
  • అసలు అక్కడ 120 సర్వే నంబరే లేదని తేల్చిన అధికారులు
Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ వైసీపీ మాజీ మంత్రి అనుచరులు నిజంగానే నాలుగున్నర ఎకరాల భూ కబ్జా చేశారా? లేక ఆ పేరుతో పొలిటికల్‌గా ఆయన్ని బుక్‌ చేయాలనుకున్న ప్రత్యర్థులు బుక్‌ అయిపోయారా? ఏకంగా సీఎం చంద్రబాబునే ఇన్వాల్వ్‌ చేసిన ఈ వ్యవహారంలో వాస్తవాలేంటి? స్పాట్‌లో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేసిన అధికారులు ఏం తేల్చారు? ఏమని నివేదిక ఇచ్చారు…? అసలెవరా మాజీ మంత్రి? నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజు గ్రామసభలో ఇటీవల పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఆ సభకు హాజరైన ప్యాపిలి మండలం పోదొడ్డి రైతు రామచంద్ర సంచలన ఆరోపణలు చేశారు. గ్రామ సర్వే నంబర్‌ 120లో తన భార్య రమాదేవి పేరిట ఉన్న నాలుగున్నర ఎకరాల పొలాన్ని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనుచరులు కబ్జా చేశారని, అధికారులకు 32 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీఎంకు కంప్లయింట్‌ చేశారు రామచంద్ర.

దీనిపై తక్షణం స్పందించిన సీఎం ఆర్డీవోను పిలిపించి విచారణకు ఆదేశించారు. ఇదంతా… సభా వేదిక మీదే జరగడం ఒకరకంగా సంచలనమైంది. బుగ్గన భూ కబ్జా చేశారని కొందరు, కాదు ఆయన్ని పబ్లిక్‌గా బుక్ చేయడానికి ప్రత్యర్థులు అలా ప్లాన్‌ చేశారా అని మరికొందరు ఇలా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. రైతు రామచంద్ర మాత్రం ఆ భూమి 110 ఏళ్ల నుంచి తమ కుటుంబ ఆధీనంలోనే ఉందని వాదిస్తున్నారు. కానీ… అఫీషియల్‌ వెర్షన్‌ మాత్రం వేరేలా ఉంది. ఆ భూమి మొత్తం కొండ ప్రాంతం. రైతు చెబుతున్నట్టు అసలు 120 సర్వే నంబరే ఆర్ ఎస్ ఆర్ లో లేదట. దానికి సంబంధించి మాన్యువల్ అడంగల్ సృష్టించుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నట్టు రెవెన్యూ అధికారుల విచారణలో తేలిందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు… ఇదే సర్వే నంబర్‌లో రామచంద్రకు నాలుగున్నర, ఆయన భార్యకు మరో నాలుగున్నర ఎకరాలున్నట్టు రికార్డ్‌లు సృష్టించేశారన్నది రెవెన్యూ అధికారుల మాట.

ఒకే కుటుంబంలోని వారికి 5 ఎకరాలకు మించి అసైన్డ్ భూమి ఉండకూడదన్న 2023 నిబంధనల మేరకు అతని భార్య పేరుతో ఉన్న పొలాన్ని కటిక వెంకటేశ్వరి పేరుతో అసైన్మెంట్ కమిటీలో తీర్మానం చేసి పంపారట. ఇక రామచంద్ర చెబుతున్న పొలం పక్కనే 108 సర్వే నెంబర్‌ ఉంది. అందులో బుగ్గన మేనల్లుడు నితిన్ రెడ్డికి చెందిన పొలం ఉందని, వశిష్ట మైనింగ్ పేరిట కంకర ఫ్యాక్టరీ ఉండేదని చెబుతున్నారు. ఈ క్రమంలో….తన భార్య పేరుతో ఉన్న భూమిని కలుపుకోడానికే వెంకటేశ్వరి పేరుతో అసైన్మెంట్ కమిటీలో తీర్మానించారన్నది బాధితుడి ఆరోపణ. ఇక తన అనుచరులు భూమి ఆక్రమించారన్న ఆరోపణలపై బుగ్గన రియాక్ట్ అయ్యారు. తమకు కావాల్సినంత ఆస్తి వుందని, ఎవరి భూమినో ఆక్రమించాల్సిన ఖర్మ పట్టలేదని అన్నారాయన. ఇక ఇదే సమయంలో మా నాయకుడిని బుక్ చేయడానికి ప్రయత్నించి టీడీపీ నేతలు విఫలమయ్యారంటూ మాజీ మంత్రి అనుచరులు హ్యాపీగా ఉన్నట్టు తెలిసింది.

ఈ వ్యవహారంపై సీఎం ఆదేశాలతో విచారణ జరిపి స్థానిక అధికారులు నివేదిక కూడా పంపారట. అసలు ఇక్కడ 120 సర్వే నెంబర్ అన్నదే లేదని, పైగా అప్పటికే రైతు రామచంద్రకు నాలుగున్నర ఎకరాలు కేటాయించినందున రూల్స్‌ ప్రకారం అదే ఫ్యామిలీలోని ఏ ఇతర సభ్యులకు ఇవ్వడానికి వీల్లేదని నివేదించినట్టు సమాచారం. అలాగే…కబ్జా అయిందని రామచంద్ర చెబుతున్న భూమిని వెంకటేశ్వరికి ఇస్తూ అసైన్మెంట్‌ కమిటీ తీర్మానించినా… దాని మీద జాయింట్ కలెక్టర్ సంతకం లేకపోవడంతో అది కూడా చెల్లదని కూడా తేల్చేశారు. దీంతో ఆ భూమి అటు రామచంద్ర భార్యకు గాని, ఇటు వెంకటేశ్వరికి గాని చెందే అవకాశమే లేదు. అదెలా ఉన్నా…మొత్తం మీద బుగ్గన అనుచరుల భూ ఆక్రమణ పేరిట జరిగిన డ్రామాను మాత్రం ఎవరికి వారు తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • buggana rajendranath
  • NTV Telugu
  • OTR

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions