Odisha custodial assault: ఒడిశా ఘటనపై ఆర్మీ వర్సెస్ పోలీస్.. ఆర్మీ అధికారి- కాబోయే భార్యపై దాడి కేసు..
- ఆర్మీ అధికారి-కాబోయే భార్యపై ఒడిశా పోలీసులు దాడి..
- దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఘటన..
- ఆర్మీ వర్సెస్ పోలీసులుగా మారిన వైనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha custodial assault: ఒడిశాలో ఆర్మీ అధికారికి కాబోయే భార్యపై పోలీసులు కస్టడీలో దాడి చేయడం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా పోలీసుల తీరు ప్రజల్లో ఆగ్రహానికి గురైంది. ఈ ఘటన చర్చనీయాంశం కావడంతో ఉన్నతాధికారులు స్పందించి, మహిళపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేసింది. అయితే, ఈ ఘటన ఆర్మీ వర్సెస్ పోలీస్‌గా మారింది. చాలా మంది వెటరన్ ఆర్మీ అధికారులు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేస్తున్నారు. ఈ ఘటనపై జనరల్ వీకే సింగ్(రిటైర్డ్) తో సహా ఆర్మీ వెటరన్లు ఈ సంఘటనను ‘‘అవమానం మరియు భయంకరమైనది’’గా పేర్కొన్నారు. రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా పోలీసులు దోషులుగా తేలితే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఒడిశా భరత్పూర్ పోలీస్ స్టేషణ్‌లో తనను కొట్టి, లైంగికంగా వేధించారని ఆర్మీ అధికారిని, తనను అక్రమంగా సెల్లో బంధించారిన సదరు మహిళ ఆరోపించింది. రోడ్డుపై జరిగిన గొడవపై జంట ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కేసు సంచలనంగా మారడంతో ఐదుగురు పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేశారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్(రిటైర్డ్), మాజీ కేంద్రమంత్రి వీకే సింగ్ దాడికి పాల్పడిన పోలీస్ సిబ్బందిపై, వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న వారినిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకోవాలని కోరతూ..మేజర్ గౌరవ్ ఆర్య(రిటైర్డ్) ట్వీట్ చేశారు. “ఒడిశా పోలీసులు ఆర్మీ అధికారితో అనుచితంగా ప్రవర్తించారు మరియు అది నేరం. వారు ఒక మహిళను కూడా దారుణంగా ప్రవర్తించారు, అవమానించారు మరియు హింసించారు.. క్షమించేది లేదు.’’ అని ట్వీట్ చేశారు. మేజర్ జనరల్ హర్ష కకర్ (రిటైర్డ్) ఒడిశా పోలీసులపై విరుచుకుపడ్డారు. ఆర్మీ అధికారిని, ఓ మహిళని వేధించడంపై ధ్వజమెత్తారు.
అయితే, పోలీసులు దీనికి స్పందించారు. మద్యం తాగి నడపడంతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులతో గొడవకు దిగడం, పోలీస్ స్టేషన్లో గందరగోళం సృష్టించినందుకు ఆర్మీ అధికారిపై చర్యలు తీసుకున్నారా..? అని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావు(ఒడిశా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్) ప్రశ్నించారు. అయితే, తప్పు చేసిన పోలీస్ అధికారుల్ని చట్టప్రకారం శిక్షించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. వీకే సింగ్ ట్వీట్‌పై నాగేశ్వర్ రావు స్పందిస్తూ.. ఒక ఆర్మీ అధికారి మరియు అతని కాబోయే భార్య యొక్క మద్యం మత్తులో మరియు అసభ్య ప్రవర్తించారు అని అన్నారు. ఒడిశా పోలీసుల్ని దూషించడం కరెక్ట్ కాదని అన్నారు.
“భువనేశ్వర్‌లో, ఒక ఆర్మీ అధికారి మరియు అతని కాబోయే భార్య 10 పెగ్‌ల మద్యం సేవించి, అర్ధరాత్రి 2 గంటల సమయంలో కారు నడుపుతూ, తెల్లవారుజామున 2-30 గంటల సమయంలో ఇంజినీరింగ్ విద్యార్థులతో గొడవ పడి, ఆపై భరత్పూర్ పోలీస్ స్టేషన్లో గొడవకు దిగారు. పోలీస్ స్టేషన్ లోపల గొడవ జరిగింది, సిబ్బంది PCR సహాయం కోరవలసి వచ్చింది” అని నాగేశ్వర్ రావు అన్నారు. పోలీసులు సైన్యాన్ని గౌరవిస్తుందని, భారత సైన్యం పేరును అవమానించిన ఆర్మీ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!