1.తెలంగాణ రాజకీయం హస్తినలో చేరింది. ఢిల్లీలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ల్యాండ్ అయ్యారు. అయితే అందరూ కలిసిమెలసి ఢిల్లీకి వెళ్లారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఢిల్లీకి వెళ్లేందుకు ఒక్కొక్కరి ఒక్కో ప్రాబ్లెం.. కాంగ్రెస్ విషయానికి వస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన జగ్గారెడ్డి ఎపిసోడ్, తదితర అంశాల గురించి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇచాంర్జీ మాణిక్కం ఠాగూర్‌తో మాట్లాడేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లారు. అధిష్టానం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, భట్టిలు ఢిల్లీ చేరుకున్నారు.
2.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ను కలిశారు. మాణిక్కం ఠాగూర్‌తో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంతో పోరాటం అని కేసిఆర్, మంత్రులతో సహా మాట్లాడుతున్నారని, కేసిఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, జైలుకు పోవడం ఖాయమని బీజేపి నేతలు మాట్లాడుతున్నారన్నారు.
3.ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా టిక్కెట్ రేట్లను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ గురించి తాను ఒకే ఒక్క మాట చెబుతానని.. మీడియా వాళ్లు రెండో ప్రశ్న అడగడానికి వీల్లేదు అంటూ కామెంట్ చేశారు.
4.ఏపీ అసెంబ్లీలో మంగళవారం కూడా గందరగోళం చోటుచేసుకుంది. సభ ప్రారంభమైన వెంటనే జంగారెడ్డి గూడెం సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. పోడియం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని స్పీకర్ ముందే హెచ్చరించినా టీడీపీ సభ్యులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో స్పీకర్ పలువురు టీడీపీ నేతలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు.
5.ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. “ది కాశ్మీర్ ఫైల్స్” కు వ్యతిరేకంగా మాట్లాడే ముఖ్యమంత్రికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు.. పాకిస్థాన్, చైనాలకు అనుకూలంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన.. త్వరలో “పాతబస్తీ ఫైల్స్”, “అవినీతి ఫైల్స్” బయటకు వస్తాయన్నారు.. అయినా, నీకు కాశ్మీర్ ఫైల్స్ ఎందుకు నచ్చుతాయి.. దోపిడీ దొంగలు లాంటి సినిమాలు నచ్చుతాయన్నారు.
6.ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రాజకీయంలో పోలీసులు ఇరుక్కుని పోయారు. ఆరు రోజుల క్రితం పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చిన మాజీ కార్పోరేటర్ ఆచూకీ లేకుండా పోయింది. ఈఘటనపై భార్య ఆందోళన చేస్తే ఆమె పట్ల పోలీసు అధికారులే దురుసుగా ప్రవర్తించారు. తన భర్తను ఏమి చేశారని భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి ఆయన అనుచరులు తన భర్త పై కేసు పెట్టించారని జంగం భాస్కర్ భార్య కల్పన ఆరోపిస్తోంది.
7.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీలను ఆదుకుంద వైఎస్సార్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సభకు విచ్చేసిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మైనార్టీల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు.
8.ఆహాలో వీకెండ్ ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడిల్ మరో లెవెల్ కు చేరుకుంది. మొదటి వడపోతలో ఎంపికైన 12 మంది కంటెస్టెంట్స్ కు మధ్య పోటీ షురూ అయ్యింది. ఈ శుక్ర, శనివారాల్లో ఆ పన్నెండు మంది అద్భుతమైన పాటలు పాడి తగ్గేదే లే అంటూ ముందుకు సాగారు. అందులో కొందరి పాటలకు ఫిదా అయిన న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యా మీనన్, కార్తీక్ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అంటూ స్పెషల్ గా కితాబిచ్చారు. విశేషం ఏమంటే…
9.ప్రస్తుతం భారతీయ చిత్రసీమ మాత్రమే కాదు… అన్ని పొలిటికల్ పార్టీలూ మాట్లాడుకుంటున్న సినిమా ఒక్కటే… ‘ద కశ్మీర్ ఫైల్స్’. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సినిమాను చూసి వినోదపు పన్ను రాయితీ ఇస్తే, ఆ పార్టీని వ్యతిరేకించే తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి వారు ‘ద కశ్మీర్ ఫైల్స్’ సమాజంలో రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే చిత్రమని అభివర్ణిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు వందల థియేటర్లలో పది రోజుల క్రితం విడుదలైన ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఇవాళ నాలుగు వేల థియేటర్లలో ప్రదర్శితమౌతోంది. వరల్డ్ వైడ్ రూ. 200 కోట్ల గ్రాస్ మైలురాయిని చేరుకుంటోంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో కశ్మీర్ పండిట్ గా కీలక పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్ నూ ప్రేక్షకులు విశేషంగా అభినందనలతో ముంచెత్తుతున్నారు.
10.మెగా బ్రదర్ నాగబాబు ఏమి మాట్లాడిన కొద్దిగా వెటకారం, కొద్దిగా హాస్యం జోడించి మాట్లాడతారు. ఇంకొన్నిసార్లు వివాదాలను కొనితెచ్చుకోవడం నాగబాబుకు అలవాటు. ఇక ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు అభిమానులతో మాత్రం నిత్యం టచ్ లో ఉంటాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తాడు. అందుకే అభిమానులు.. నాగబాబుతో చిట్ చాట్ అంటే ఎంతో ఆసక్తి కనపరుస్తారు. ఇక తాజాగా మరోసారి అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన నాగబాబుకు ఈసారి తమ పిల్లల గురించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు.. నిహారిక ఏమి చేస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఎందుకు డిలీట్ చేసింది అంటూ నెటిజన్స్ ప్రశ్నలు సంధించారు.