1.ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఏపీ వైద్యారోగ్య అధికారులను కలవరానికి గురి చేస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా ఈరోజు 43,763 శాంపిల్స్‌ను పరీక్షించగా 12,926 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
READ ALSOఏపీలో కరోనా టెర్రర్.. కొత్తగా 12,926 కేసులు
2.వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగాయని టీజీ వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా కర్నూల్‌లో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆలయాలపై దాడులను వ్యతిరేకిస్తే బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారన్నారు. 80 శాతం హిందువులున్నా 20 శాతం ఉన్న మైనార్టీలకు రాజ్యాంగంలో రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. భారతీయులంతా అన్నదమ్ములు అని మైనార్టీలు భావించాలన్నారు.
READ ALSO వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగాయి: టీజీ వెంకటేష్
3.ఏపీలో క్యాసినో మంట రాజుకుంటూనే వుంది. కొడాలి నానిపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నేత ధూళిపాళ్ళ నరేంద్ర స్పందించారు. గుడివాడ కె కన్వెన్షన్లోనే క్యాసినో నిర్వహించారని ఆధారాలంటూ కొన్ని వీడియో క్లిప్పింగులను మీడియాకు విడుదల చేశారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర. క్యాసినో నిర్వాహకుడు ప్రేమల్ టోపీ వాలా ఫేస్ బుక్ అకౌంట్లల్లోని వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు ధూళిపాళ్ల.
READ ALSOముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతం..?
4.లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడింది.శనివారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో లతా మంగేష్కర్ కు చికిత్స చేస్తున్న డాక్టర్ ప్రతిత్ సమదానీ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించారు. “గాయని లతా మంగేష్కర్ ఇప్పటికీ ఐసీయూలో ఉన్నారు, కానీ ఈ రోజు ఆమె ఆరోగ్యంలో స్వల్ప మెరుగుదల ఉంది. ఆమెను ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ”అని డాక్టర్ పేర్కొన్నారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని లతా మంగేష్కర్ బృందం ఇప్పటికే ప్రజలను కోరింది.
READ ALSOలతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ ఏమన్నారంటే..?
5.గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2018 డిసెంబర్‌లో ప్రియాంక, నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ జంట తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా సరోగసీ ద్వారా వారు తల్లిదండ్రులు అయ్యినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం.
READ ALSOసీక్రెట్ గా తల్లి అయిన ప్రియాంక చోప్రా..
6.ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సోము వీర్రాజును ఇప్పుడు అందరూ సారా వీర్రాజు అనే పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పై మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను సారా వీర్రాజు చేస్తున్నాడని, జగన్ చిటికెన వేలు కూడా తాకే స్థాయి లేని వ్యక్తి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి సారా వీర్రాజు.. సీఎంను దేశ ద్రోహి అని వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
READ ALSO ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. సోము వీర్రాజు పై మంత్రి వెల్లంపల్లి ఫైర్
7.కేసీఆర్ సర్కార్ పై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ప్రస్తుతం జరగుతున్న ఫీవర్ సర్వేపై ట్విట్టర్ వేదికగా ఆమె కేసీఆర్‌ప్రభుత్వాన్ని నిదీసింది. ఏ చిన్న సమస్య అయినా ఈ మధ్యన ట్విట్టర్ ద్వారా కేసీఆర్ సర్కార్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికి ఫీవర్ టెస్టులు చేసే హెల్త్ వర్కర్ల ప్రాణాలంటే పట్టింపు లేదా? వాళ్ళ ప్రాణాలు లెక్క లేదా? చీర కొంగులు.. కర్చీఫులు కట్టుకొని సర్వే చేయాల్నా?
READ ALSOహెల్త్ వర్కర్లవి ప్రాణాలు కాదా.. ఫీవర్ సర్వేపై షర్మిల ఫైర్
8.ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 1న జీతం రావడం లేదు.. పింఛన్ ఇవ్వడం లేదు.. ఏపీ లో ఖజానా ఖాళీ అయింది…ప్రభుత్వం దివాళా తీసింది అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. మద్యం, ఇసుక మాఫియా కారణంగా ఖజానా ఖాళీ అయిందని, ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ద్వారా వేతనం పెంచకుండా తగ్గించిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అధికారం ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలని ఆయన అన్నారు.
READ ALSOఏపీలో ఖజానా ఖాళీ అయ్యి.. ప్రభుత్వం దివాళా తీసింది : అరుణ్ సింగ్
9.నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ప్రోగ్రాం అన్ స్టాపబుల్. ఈ ప్రోగ్రాం మొదటి నుంచి అందరిని ఆకర్షిస్తోంది. ఈ ప్రోగ్రాంలో బాలయ్య హోస్ట్ గా ఇరగదీస్తున్నారనే చెప్పాలి. ఈ ప్రోగ్రాంకు వచ్చిన సినీప్రముఖులు గురించి తెలియని విషయాలను ప్రజలకు చెబుతున్నారు బాలయ్య. అయితే తాజాగా ఈ ప్రోగ్రాంకు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు విచ్చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను నిన్న విడుదల చేయగా ప్రస్తుతం నెట్టింట్ల వైరల్ అవుతుంది.
READ ALSOబాలకృష్ణ-మహేష్ అన్ స్టాపబుల్ ప్రోమో.. ప్రముఖ క్రికెటర్ కామెంట్స్..
10.భారత్‌లో సినిమాలు, క్రికెట్‌ను వేరు చేసి చూడలేం. ఐపీఎల్ ప్రాంరంభమైనప్పటి నుంచి ఐపీఎల్ జరిగినన్ని రోజులు క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగ ఇది. అయితే ఐపీఎల్-2022 మెగా వేలం వచ్చే నెలలో జరగబోతుంది. ఇందుకోసం ఆటగాళ్ల పూర్తి జాబితా వచ్చేసింది. ఈ లీగ్ కోసం 1,214 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా 318 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 10 జట్లు ఇందులోని అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు పోటీ పడతాయి.
READ ALSO 2022 ఐపీఎల్ వేలంలో 1,214 మంది ఆటగాళ్లు