1.ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. రష్యా దళాలను ఉక్రెయిన్ సేనలు అడ్డుకుంటున్నాయి. ఉక్రెయిన్ దళాలతో పాటు ప్రజలు కూడా రష్యా సేనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రష్యా కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నది. రష్యా సైన్యానికి అండగా పుతిన్ ప్రపంచాన్ని భయపట్టే బాంబును బయటకు తీస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ బాంబుపేరు ఫాథర్ ఆఫ్ ఆల్ బాంబ్స్.
2.రాబోయే రోజుల్లో నీటికొరతను నివారించేందుకు, భవిష్యత్ తరాల కోసం నదుల్ని పరిరక్షించాల్సిన అవసరం వుందన్నారు మంత్రి హరీష్ రావు. నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణ పైనే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. మిషన్ కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మిషన్ కాకతీయతో పడ్డ ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి ఆయకట్టు పెంచుకున్నాం
3.ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారుతోంది. ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో అక్కడి పౌరులు, పార్లమెంటు సభ్యులు కూడా యుద్ధానికి మేం రెడీ అంటున్నారు. ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యురాలు, మహిళా ఎంపీ కిరా రుడిక్ తానూ యుద్ధం చేస్తానంటూ ఆయుధం చేతబట్టారు. ఈ మేరకు ఆమె చాలామందిలాగే తాను కూడా రష్యా దాడిని ఎదుర్కొని తన దేశాన్ని, ప్రజలను రక్షించడానికి కలాష్నికోవ్ అనే ఆయుధాన్ని తీసుకున్నానని అన్నారు. అంతేకాదు ఈ ఆయుధాన్ని ఉపయోగించడం నేర్చుకోవడమే కాక ధరించేందుకు సిద్ధమవుతున్నానని చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది.
4. ఎంతో మంది కళాకారులు నైపుణ్యంతో వస్తువులు తయారు చేస్తున్నారని, కళాకారులకు ప్రోత్సాహం అవసరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు హస్త కళలను ప్రోత్సహించాలని, మార్చి 6వ తేదీ వరకు హునర్ హాట్ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. మేకిన్ ఇండియా మేడిన్ ఇండియాలో భాగంగా ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన వెల్లడించారు. ఏ దేశానికి మనం తక్కువ కాదు, గొప్ప వారసత్వం మనదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చాలా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేసి వస్తువులు కొంటారు.
5.తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వ్యక్తిగత విమర్శలు మానుకో అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎంపీ రంజిత్ రెడ్డి హెచ్చరించారు. చాతనైతే ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం పార్లమెంట్‌లో మాతో పాటు కొట్లాడు అని ఆయన అన్నారు. వరి కొనుగోలు కోసం కేంద్రంతో ఎంపీలం పోరాటం చేస్తే మాతో పాటు పోరాటం చేయడానికి రావడానికి చాతకాలేదని ఆయన విమర్శించారు.
6.మల్టీస్టారర్ సినిమా అంటే ఇద్దరు హీరోలు.. నటన పరంగా పోటాపోటీగా ఉంటుంది. ఒకరి నటన ఎక్కువ ఒకరి నటన తక్కువ అని చెప్పలేము. అయితే అందులో పాత్రను బట్టి ఎవరు డామినేట్ చేశారు అనేది చెప్పొచ్చు. తాజగా భీమ్లా నాయక్ లో పవన్, రాం తన గురించి సినీ అభిమానులు ఇదే అంశంపై చర్చ సాగిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పాత్ర కన్నా రానా పాత్ర డామినేట్ చేసింది అనేది కొంతమంది మాట.
7.ఒకప్పుడు కాంగ్రెస్ గా కంచుకోట అయిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ కార్యాచరణను మొదలు పెట్టారా… అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో ఎంపీ లు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారా.. అందుకే ఇద్దరు ఎంపీలు తమ సొంత నియోజక వర్గంలో కొత్తగా క్యాంపు ఆఫీస్ లను ఏర్పాటు చేశారా? అంటే అవునంటున్నారు కాంగ్రెస్ నేతలు.
8.తెలంగాణలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్రం తీరుని ఎండగడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన రీతిలో ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ ( ఉప్పుడు బియ్యం ) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ మొండి వైఖరి ప్రదర్శిస్తోందన్నారు కవిత.
9.భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది.. శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ విక్టరీ కొట్టి మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక, ఈ విజయంతో.. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.. స్వదేశంలో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్‌గా మొదటి స్థానానికి దూసుకెళ్లాడు.. ఇప్పటివరకు భారత టీ20 కెప్టెన్‌గా రోహిత్ సొంతగడ్డపై 15 సార్లు జట్టుకు విజయాలను అందించాడు
10.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా ఎస్. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 11 న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్టార్లందరను రంగంలోకి దింపారు మేకర్స్. ఎపిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా హిందీ వెర్షన్ కోసం అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మిగతా భాషల్లో కూడా స్టార్లను రంగంలోకి దింపారు మేకర్స్.