1.కేంద్ర బడ్జెట్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బడ్జెట్లో తెలంగాణకు మొండిచెయ్యి చూపారని, మెట్రో రైలు కు నిధులు అడిగాం ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కోరినా పట్టించుకోలేదన్నారు. మిషన్ భగీరథ కు ఫండ్స్ అడిగినా ఇవ్వకపోవడం దారుణం అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఈ దేశంలో లేదన్నట్టు వ్యవహరించారు. ప్రగతి శీల రాష్ట్రాలకు ఇలాగేనా చేసేది అని కేటీఆర్ ప్రశ్నించారు.
2.కేంద్ర బడ్జెట్ దేశానికి మేలుచేసేలా లేదన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. రైతులకు మేలు, యువకులకు ఉపాధి, మహిళలకు రక్షణ వేటికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినందుకు రైతులపై కక్షగట్టి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని విమర్శించారు.
3.తెలంగాణా హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జిల నియామకానికి ఆమోదం తెలిపింది సుప్రీంకోర్టు కొలీజియం. ఏడుగురు న్యాయవాదులు, ఐదుగురు జ్యూడిషియల్ ఆఫీసర్లను జడ్జీలుగా సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.
4.కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష నేతలు నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. విభజన హామీలు ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదు.ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్, మెట్రోరైలు వంటివి ప్రస్తావనే లేదన్నారు సీపీఐ, సీపీఎం నేతలు.
5. ఏపీ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు కొత్త పే-స్కేళ్లపై కసరత్తు ప్రారంభమయింది. కొత్త పే-స్కేల్ ఫిక్సేషన్ కోసం పీఆర్సీ ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల కోసం రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటుచేశారు. ట్రాన్స్ కో, జెన్కో, డిస్కంలల్లో పని చేసే ఉద్యోగులకు కొత్త జీతాలపై రికమెండేషన్స్ చేయనుంది ఈ కమిషన్.