Tension in Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించడంతో నందిగామలో ఉద్రిక్తత వాతావరణానికి కారణం అయ్యింది.. ట్రాఫిక్‌కు అడ్డుగా ఉందని రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో తొలగించారు మున్సిపల్ అధికారులు… గాంధీ సెంటర్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించిన ప్రదేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దేవినేని అవినాష్, గౌతమ్, రెడ్డి, మొండితోక జగన్ మోహన్ రావు ఆందోళనకు దిగారు.. వైసీపీ కార్యాలయం నుండి గాంధీ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించిన ప్రదేశంలో నిరసన తెలిపారు.. రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించిన ప్రాంతంలో నిచ్చెన వేసుకుని ఎక్కి నిరసన తెలిపారు..
Read Also: PVNS Rohit : మొన్నే నేషనల్ అవార్డు.. నేడు ఎంగేజ్ మెంట్ చేసుకున్న సింగర్
అయితే, ఈ నిరసన సమయంలో వైసీపీ నాయకులు.. స్థానిక సీఐ మధ్య వాగ్వాదం జరిగింది.. ఎక్కడైతే విగ్రహం తొలగించారో అదే ప్రదేశంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొబైల్ విగ్రహం ఏర్పాటు చేసింది వైసీపీ.. మున్సిపల్ కార్యాలయంలో ఉన్న వైయస్సార్ విగ్రహాన్ని చూడటానికి వీలులేదని పోలీసులు అడ్డుకోగా.. పోలీసులను తోసుకుంటూ గేటు నెట్టేసి లోపలికి వెళ్లారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.. మున్సిపల్ ఆఫీస్‌లోని రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు నేతలు.. అనంతరం నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దేవినేని అవినాష్.. మొండితోక జగన్ మోహన్ రావు..
Read Also: Dhruv Jurel: కెప్టెన్‌గా ధ్రువ్ జురెల్.. రాజస్థాన్ రాయల్స్ పోస్ట్ వైరల్!
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. కోర్టు దృష్టికి తీసుకెళ్తే విగ్రహాన్ని తొలగించమని చెప్పిన అధికారులు.. దొంగల్లాగా అర్ధరాత్రి సమయంలో విగ్రహాన్ని తొలగించారు.. మా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని చూస్తే చాలా బాధేసింది.. విగ్రహానికి చెయ్యి విరిగిపోయింది.. డ్యామేజ్ అయింది.. దీని వెనుక ఎవరి పాత్ర ఉన్నా.. వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.. ఇక, గత ఐదేళ్లు నందిగామలో ప్రశాంత వాతావరణం ఉందని.. ఇప్పుడు కావాలని గొడవలు సృష్టిస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వం రాగానే తిరిగి ఎక్కడైతే వైఎస్ఆర్ విగ్రహం తొలగించారో అక్కడే మళ్లీ ప్రతిష్టిస్తామని ప్రకటించారు.. ఎంపీ, ఎమ్మెల్యేకి ఇసుక, మద్యం తదితర అక్రమ వ్యాపారాల విషయంలో మామూళ్ల కోసం గొడవలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు దేవినినేని అవినాష్..