Site icon NTV Telugu

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

Kodali Nani

Kodali Nani

Kodali Nani: మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్‌ నానిపై మూడు కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీ పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశాయి. కొడాలి నానిపై గుడివాడలో 2, విశాఖపట్నంలో ఒక కేసు రిజిస్టర్‌ అయ్యాయి. ఇవి కాకుండా మైనింగ్‌ అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది. ఈ సమయంలో కొడాలి నాని అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీకి టీడీపీ ఫిర్యాదు చేయటంతో లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.

Read Also: COVID 19: కోవిడ్ బారిన పడ్డ మరో సినీ నటి..

2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు కొడాలి నాని చెలరేగిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లను ఇష్టమొచ్చినట్టు తిట్టిపోశారు. నోటికి ఎంతొస్తే అంత మాట అనేవారు. టీడీపీ టార్గెట్‌ లిస్ట్‌లో కొడాలి నాని పేరు అందరికంటే ముందుంది. కొడాలి నాని ఫ్రెండ్‌ అయిన వల్లభనేని వంశీ ఇప్పటికే కటకటాల్లో ఉన్నారు. 100 రోజులుగా జైలు జీవితం గడుపుతున్నారు వల్లభనేని వంశీ. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కొత్త కేసు వంశీపై నమోదవుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు వంశీపై మొత్తం 8 కేసులున్నాయి. ఇప్పుడు కొడాలి నానిపై ఫోకస్‌ చేసినట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.

Read Also: Astrology: మే 24, శనివారం దినఫలాలు

వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారని కొడాలి నానిపై ఒక కేసు నమోదైంది. అలాగే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, విశాఖలో మరో కేసు నమోదయ్యాయి. ఈ మూడు కేసుల్లోనూ నానికి ముందస్తు బెయిల్ వచ్చింది. గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీలో మెరక చేయటం కోసం మట్టి తవ్వకాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో కొడాలి నానీ గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఈ మధ్యే ముంబయిలో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. కొడాలి నాని ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. అయితే వైద్యం కోసం అమెరికా వెళ్తారని ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. దీంతో ఆయనపై ఉన్న కేసులు విచారణ దశలో ఉన్నాయని కొడాలి దేశం విడిచి వెళ్లకుండా చూడాలని ఏపీ డీజీపీకి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ రావు ఈ నెల 18న ఫిర్యాదు చేశారు.

Read Also: Off The Record: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాపు తమ్ముళ్లు కుదురుగా ఉండలేకపోతున్నారా..?

డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ విచారణ జరిపారు. ఈ నెల 22న కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. కొడాలి నానికి ఏపీలో పాస్ పోర్ట్ లేదు. తెలంగాణ అడ్రస్‌తో పాస్‌పోర్ట్ పొందే అవకాశాలు ఉండటంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టులు, నౌకాశ్రాయాలకు ఆన్‌లైన్ ద్వారా లుక్ అవుట్ నోటీసు పంపించారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే త్వరలోనే కొడాలి నాని అరెస్ట్‌ ఖాయమని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
22న కొడాలి నానిపై లుకౌట్‌ నోటీసులు.

Exit mobile version