Shilpa Shetty : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వారిపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరిద్దరూ కలిసి ముంబైకే చెందిన బిజినెస్ పర్సన్ దీపక్ కొఠారిని రూ.60 కోట్ల వరకు మోసం చేశారనే కేసు గతంలోనే నమోదైంది. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. శిల్పాశెట్టి దంపతుల ట్రాలెవ్ హిస్టరీని పరిశీలిస్తున్నారు. ఈ కేసు విచారణ స్పీడ్ గా…
వివిధ వ్యాపారాల పేరుతో చాలా మందిని నుంచి అందినకాడికి అనే తరహాలో.. కోట్లాది రూపాయలు మోసాలు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న కొత్తచెరువుకు చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాల్ మిల్ సూరిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు.
సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్లకి మ్యూల్ అకౌంట్లు సమకూర్చిన నేరగాళ్లను గుర్తించారు. మొత్తంగా ఆరుగురిపై కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా ఒకరిని ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు. మొన్ననే 25 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ముఠా బాగోతాన్ని బయట పెట్టారు. సైబర్ క్రిమినల్స్‌కు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న నేరగాళ్లను గుర్తించారు.. ఇటీవల హైదరాబాద్‌లో ఉంటున్న…
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ నానిపై మూడు కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశాయి. కొడాలి నానిపై గుడివాడలో 2, విశాఖపట్నంలో ఒక కేసు రిజిస్టర్ అయ్యాయి. ఇవి కాకుండా మైనింగ్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ సమయంలో కొడాలి నాని అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీకి టీడీపీ ఫిర్యాదు చేయటంతో లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.
మాజీ మంత్రి కొడాలి నానికి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న నోటీసులు జారీ చేశారు కృష్ణా జిల్లా పోలిసులు. కొడాలి నానిపై అనేక కేసులు విచారణ దశలో ఉన్నాయని, ఈ సమయంలో వైద్య చికిత్స పేరుతో అమెరికా వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు డీజీపీ కి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ నెల 18న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస రావు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు…
మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు.. ఆరు బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు.. కాకాణిపై నమోదైన కేసుల విషయంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యగా.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి విదేశాలకు వెళ్లకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు..
Betting Apps : ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ సూచన మేరకు సూర్యాపేట జిల్లా పోలీసులు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు చేశారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కారణంగా నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. అయితే, సన్నీ యాదవ్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో, పోలీసులు అతని ఇంటికి నోటీసులు అంటించారు. నోటీసులు ఇచ్చిన రెండు వారాలు గడుస్తున్నప్పటికీ, అతని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, పోలీసులు కీలక…
Falcon Scam Case: ఫాల్కన్ కేసు విషయంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా ఈఓడబ్ల్యూ డీసీపి ప్రసాద్ మాట్లాడారు. 2021 నుండి డిపాజిట్లు వసూలు చేస్తున్నారని, ఫాల్కన్ ఇన్ వాయిస్ డిస్కౌంట్ ప్లాట్ ఫాం పేరుతో డిపాజిట్లు తీసుకున్నారని ఆయన అన్నారు. ఈ కేసులో కావ్య, పవన్ లను అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు అమీర్ దీప్ తో పాటు సురేందర్ మరికొంత మంది పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. నిందితులపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామని, విదేశాలకు…
Lookout Notice On Siddique: లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు సిద్ధిక్‌కి హైకోర్టు షాక్ ఇచ్చింది. సిద్ధిక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. తిరువనంతపురం మ్యూజియం పోలీసులు నమోదు చేసిన కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సిద్ధిక్ డిమాండ్ చేశారు. అయితే ఈ విషయాలను హైకోర్టు తిరస్కరించి ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. బిల్కిస్ బాను కేసులోని…
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి కోట్లాది రూపాయాలు వసూలు చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత రాజేంద్ర బాలాజీ కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. మాజీ మంత్రి కోసం ఇప్పటికే రంగంలోకి దిగాయి పోలీసు ప్రత్యేక బృందాలు.. దాదాపు వారం రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేసినా మంత్రి జాడ దొరకడం లేదు.. దీంతో.. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం కూడా లేకుండా చర్యలు చేపట్టారు.. అన్ని ఎయిర్‌పోర్ట్‌లకు…