Producer Chadalawada Srinivasa Rao Donated one Lakh to Fish Venkat: జానర్ ఏదైనా సీరియస్ గా కనిపిస్తూనే కామెడీ పండించే నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించినా ఆయనకు కలిగిన అనారోగ్యానికి వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కిడ్నీలు పాడవడంతో గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నట్లు ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. బీపీ, షుగర్ వల్ల ఆయన కాలికి ఇన్ఫెక్షన్ కాగా తాను ఎందరికో సాయం చేశానని, ఇప్పుడు ఖర్చులకు కూడా డబ్బులు లేవని కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసి ఫిష్ వెంకట్ కి ఆర్థిక సహాయార్థం లక్ష రూపాయలు అందించారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు.
Vijayawada Floods: వరద బాధితుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు..
ఆ చెక్కును ఫిష్ వెంకట్ ఇంటికి వెళ్లి టిఎఫ్పిసి ట్రెజరర్, నిర్మాత రామసత్యనారాయణ, టిఎఫ్పిసి సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, దర్శకుడు కె. అజయ్ కుమార్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ అందించారు. ఈ సందర్భంగా టి ఎఫ్ పి సి ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ మా చదలవాడ శ్రీనివాసరావు ఎక్కడో వీడియోలో ఫిష్ వెంకట్ గారు పడుతున్న ఇబ్బంది చూసి ఆర్థిక సహాయార్థం లక్ష రూపాయలు అందించారు. అడిగితేనే సహాయం చేయలేని ఈ రోజుల్లో అడక్కుండానే సహాయం చేసే ఆయన్ని దేవుడు గా మహానీయుడుగా భావించవచ్చు. అడగకుండానే కష్టం తెలుసుకొని ఇంతటి సహాయం చేసిన చదలవాడ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అన్నారు.