Kattaleru Vagu: కట్టలేరు వాగుకు మళ్లీ పోటెత్తిన వరద.. 20 గ్రామాలకు రాకపోకలు బంద్..!
- ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం..
- మరోసారి పోటెత్తిన కట్టలేరు వాగు..
- వినగడప - తోటమూల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kattaleru Vagu: బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగుకు మరోసారి పోటెత్తింది వరద ప్రవాహం.. గంపలగూడెం మండలం వినగడప – తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు పోటెత్తిన వరదతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. గత రెండు వారాల క్రితం వచ్చిన భారీ వరదలకు గండ్లు పడ్డాయి.. మీటర్ల మేర కోతకు గురైంది తాత్కాలిక రహదారి.. ఇటీవలే రోడ్లు మరమ్మత్తుల అనంతరం రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి.. కానీ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రవాహంతో నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎగువున నుంచి వస్తున్న వరదలకు తోడు ఇక్కడ కురుస్తున్న వర్షాలు జతకావడంతో మళ్లీ పోటెత్తుతుంది వరదనీరు.. ఇక, కట్టలేరు వాగు వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. 20 గ్రామాల ప్రజలపై దీని ప్రభావం పడింది.. అత్యవసర సమయంలో నూజివీడు విజయవాడ వెళ్లాలి అంటే… అదనంగా 30 కిలో మీటర్లు తిరిగి తిరువూరు మీదగా వెళాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మరోవైపు, ఎవరు కట్టలేరు వైపు వెళ్లకుండా పీకెట్ ఏర్పాటు చేశారు పోలీస్ అండ్ రెవిన్యూ అధికారులు… ఇక, తిరువూరు నియోజవర్గంలో తెల్లవారుజాము నుండి భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో… వరద ప్రవాహం మరింత పెరుగుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి..
Also Read
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!