ముందుగా నిర్ణయించిన ప్రకారం.. శుక్రవారం రోజే నామినేటెడ్ పోస్టులు ప్రకటించాల్సి ఉన్నా… అన్నింటినీ బేరీజు వేసుకుని.. సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ఇవాళ నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు… పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు కేటాయించారు.. ఇక, మంత్రులు ప్రకటించిన నామినేటెడ్ పోస్టులు వివరాలు ఇలా ఉన్నాయి..