Nimmala Ramanaidu : జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదం
- జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన నిమ్మల రామానాయుడు
- “ఉన్మాద రాజకీయాలు” అంటూ మండిపడ్డ మంత్రి
- హామీలు, విధానాలపై తీవ్ర ఆరోపణలు
- వైఎస్సార్‌సీపీపై కఠిన వ్యాఖ్యలు.. రాజకీయ వేడి పెరుగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. జగన్ చేస్తున్న రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంలా ఉన్నాయని, రాష్ట్రంలో విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. “చంపుతాం, నరుకుతాం, అంతం చేస్తాం” అనేవి జగన్ రాజకీయ నిఘంటువులో ప్రధాన పదాలుగా మారిపోయాయని ధ్వజమెత్తారు.
జగన్ ఇచ్చే రాజకీయ హామీలు అత్యంత భయంకరంగా ఉన్నాయని మంత్రి విమర్శించారు. అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతామని, పనులు ఆపేస్తామని, యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుస్తామని జగన్ పరోక్షంగా చెబుతున్నారని ఆరోపించారు. కొత్త రకమైన మాదక ద్రవ్యాలను తీసుకువచ్చి యువతకు దాన్నే ఉపాధిగా చూపించడమే జగన్ ‘యూత్ పాలసీ’ అని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ గురించి మాట్లాడకుండా, ‘రప్పా రప్పా’ అంటూ నరుకుతామనడం ఆయన ఉన్మాదానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.
Also Read
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
Donald Trump: “హోర్ముజ్ మూసేస్తాం”.. ట్రంప్ వార్నింగ్‌తో ప్రపంచం టెన్షన్..
రాజకీయ ఎదుగుదల కోసం జగన్ తన సొంత బాబాయ్ వివేకాను కూడా వదల్లేదని మంత్రి ఆరోపించారు. “రాజకీయంగా అడ్డొస్తే సొంత బాబాయ్ నైనా అంతం చేయడమే జగన్ విధానం” అని వ్యాఖ్యానించారు. గతంలో వివేకాను బలవంతంగా ఎంపీ పదవికి రాజీనామా చేయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, తండ్రి ఆచూకీ లభ్యం కాకముందే సంతకాలు చేయించుకున్న జగన్ నైజాన్ని ఎండగట్టారు. గతంలో పరిటాల రవి హత్య కేసు నుండి జగన్ ను బయటపడేయడానికి తనకు ఆరు నెలలు పట్టిందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్న మాటలను ఆయన గుర్తు చేశారు.
వంగవీటి రంగా హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ జగన్ పై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. రంగాను హత్య చేసిన కుటుంబం ఇప్పుడు ఎవరి అండన ఉందని ప్రశ్నించారు. రంగాను ‘రౌడీ’ అని అవమానించిన గౌతమ్ రెడ్డికి ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించిన జగన్, ఇప్పుడు రంగా కుటుంబం ఏ పక్షాన ఉందో గమనించాలని సూచించారు. రంగా హత్యలో ప్రధాన నిందితుడి కుటుంబానికి హైదరాబాద్‌లో రూ. 1000 కోట్ల విలువైన స్థలాలను గిఫ్ట్‌గా ఎందుకు ఇచ్చారని జగన్‌ను నిలదీశారు.
షుగర్, బిపి కంట్రోల్ అవ్వాలా? మీ డైట్‌లో ఈ గింజలను చేర్చుకోండి!
జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తొలుత ఆర్థిక ఉగ్రవాదిగా మారి వ్యవస్థలను కలుషితం చేశారని, ఆ తర్వాత రాజకీయ పార్టీ పెట్టి పాలనను, అధికారులను కూడా భ్రష్టు పట్టించారని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ఇప్పుడు “గొడ్డలి పార్టీ”గా మారిందని, వినాశనం , విధ్వంసమే దాని ఎజెండా అని విమర్శించారు. ఇలాంటి ఉన్మాద రాజకీయాలకు రాష్ట్రంలో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Trump-Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!