Andhra Pradesh: ఏపీలో వైసీపీ సర్కారు మరో కొత్త కార్యక్రమం.. త్వరలోనే ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలో జగన్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ప్రజల నుంచి డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ కోసం ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం విధివిధానాలపై సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, వాటిలో లోపాలు, ఇతర సమస్యలపై ప్రజలు నేరుగా సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసే అవకాశం లభించనుంది.
Read Also: Dharmana Prasada Rao: మంత్రి పదవి కంటే ఈ ప్రాంతమే నాకు ముఖ్యం
Also Read
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- OTR : ఇంటింటికీ టీడీపి.. గోదావరి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేల గందరగోళం
మరోవైపు ఎస్‌డీజీ (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్) లక్ష్యాలపై సోమవారం నాడు సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక యూనిట్‌గా విలేజ్, వార్డు సెక్రటేరియట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిపై కార్యదర్శులు, విభాగాధిపతులకు ఓనర్‌షిప్ ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. కార్యదర్శి, ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి నెల గ్రామ లేదా వార్డు సచివాలయాలను సందర్శించాలని ఆయన ఆదేశించారు. ప్రగతి లక్ష్యాల సాధనపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ ఉండాలని.. ఇకపై ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతి నెలా డేటా అప్‌లోడ్ చేయాలని సీఎం జగన్ సూచించారు. ఎక్కడైనా లోపం, సమస్య ఉన్నట్టు తెలిస్తే.. పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దీని కోసం ఎస్‌ఓపీ తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ విభాగానికీ పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలన్నారు. దీని వల్ల సచివాలయాల్లోని ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది పని తీరుపై పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. వాలంటీర్లతో ప్రగతి లక్ష్యాలపై ప్రతి గ్రామంలోనూ సర్వే చేయాలన్నారు. వాలంటీర్లతో చర్చించి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!