ప్రజలకు అవగాహన లేక మోసా పోతున్నారు అని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. మొదటగా ఆర్యోగాశ్రీకి ప్రదనత ఉండాలి…కనీసం 50 శాతం ఇవ్వాలి. తెల్ల కాగితం పై బిల్లు ఇవ్వుకుడదు. ప్రైవేట్ ఆసుపత్రులు 104 ద్వారానే అడ్మిషన్ తీసుకోవాలి సొంతంగా అడ్మిషన్ తీసుకోకూడదు. ఆరోగ్యశ్రీనీ తప్పుగా ఉపయోగిస్తే ఉపేక్షించేది లేదు అని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడితే వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం అన్నారు.
ఇక అంబులెసులు ప్రభుత్వం చెప్పిన ధరలు మాత్రమే వసూలు చేయాలి. కరోనా ఆసుపత్రి గా అనుమతి లేకుండా వైద్యం చేతే వెంటనే 104 కంప్లైంట్ ఇవ్వండి.వెంటనే చర్యలు తీసుకుంటాం. వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహనా కల్పించాలి… రెండో డోస్ 12 నుంచి 16 వారాలు తర్వాత వ్యాక్సిన్ ఇస్తున్నాం…రెండు డోస్ ల మధ్య వ్యవధి పెంచాం దీనిని అందురు గమనించాలి అని పేర్కొన్నారు.