కాకినాడ మడ అడవుల తొలగింపుపై జరుగుతున్న విచారణలో అధికారులు తీరుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది… తీరప్రాంత నియంత్రణ జోన్ పరిధిని గుర్తించేందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది… వివాదంపై స్పష్టత కోరుతూ స్టేట్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ కి ఆదేశాలిచ్చింది… పర్యవేక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 2020 లో మడ అడవుల పరిధిలో 25 వేల మందికి పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది… దానిపై పర్యావరణవేత్తలు కోర్టును ఆశ్రయించారు హైకోర్టు స్టే ఇచ్చింది..
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తాజాగా గడువు ఇచ్చిన తీరప్రాంత నియంత్రణ జోన్ పరిధిని గుర్తించేందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది మడ అడవులు వివాదంపై పర్యావరణ వేత్తలు వేసిన పిటీషన్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ విచారణ చేపట్టింది సమాధానం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరికొంత సమయం అడిగింది.. దానిపై కోరం సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.మడ అడవులు సి ఆర్ జెడ్-1 ఏ పై జాయింట్ కమిటీ వెల్లడించిన అంశాలపై జిల్లా కలెక్టర్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు మడ అడవులు పునరుద్ధరణ ప్రక్రియ నడుస్తుందని కలెక్టర్ చెప్పారని జాయింట్ కమిటీ తెలిపింది.
Bandi Sanjay : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మగ్గాలకు జియో టాగ్ ఇస్తాం
మరోవైపు వివాదంపై స్పష్టత కోరుతూ స్టేట్ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీకి NGT కీలక ఆదేశాలు ఇచ్చింది 2011,2019 సి ఆర్ జెడ్ నోటిఫికేషన్ ప్రకారం ఖరారు అయిన మ్యాప్ లను సమర్పించాలని కోరింది సి ఆర్ జెడ్ పరిధిని గుర్తించడంలో చాలా ఆలస్యం చేస్తున్నారని దాన్ని పర్యవేక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.. అధికారులు తీరుపై పర్యావరణవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.. పరిహారాన్ని చాలా తక్కువగా కట్టారని చెబుతున్నారు.
మడ అడవులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి… ఇప్పుడు కోర్ట్ లో ఉన్న వివాదం అడవులు కి దూరంగా ఉన్నప్పటికీ వాటి పరిధిలోకి వస్తుంది సముద్ర తీరం కోత గురి కాకుండా ఈ అడవులు కాపాడుతాయి 1978 లో కోరంగి మడ అడవుల ప్రాంతాన్ని అభయారణ్యంగా గుర్తించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 332.66 చదరపు కిలోమీటర్ల మడ అడవులు ఉన్నాయి..ఒక్క కాకినాడ సమీపం లో కోరంగి లో 235.7 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్నాయి.. ఈ ప్రాంతంలో ఉన్నవి దేశంలోనే రెండో అతిపెద్ద మడ అడవులు కాకినాడను అనేక విపత్తుల నుంచి ఈ మడ అడవులు కాపాడుతున్నాయి… వరద నీరు రాకుండా ఉండడానికి ఇవే కారణం… కాకినాడ కోర్టుకు చెందిన 126 ఎకరాల స్థలం ఉంది 5 ఎకరాలు రైల్వే అవసరాలకు గతంలోనే ఇచ్చారు.
20 ఎకరాలలో ఉప్పుటేరు విస్తరించి ఉంది మిగతా 101 ఎకరాలు చదును చేసి పేదలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. 2020లో ఈ వ్యవహారం నడిచింది. ప్రభుత్వం నిర్ణయాన్ని మత్స్యకార సమితి వ్యతిరేకించింది. తమ జీవనోపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రేపు తీరం వెంబడి 90 వేల మంది మత్స్యకారులు వాటి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇళ్ల నిర్మాణం జరిగితే సముద్ర పాయల్ని కప్పి పెట్టాల్సి వస్తుంది అప్పుడు పూర్తిగా మత్స్య సంపద నాశనం అవుతుందంటున్నారు.
అవి మడ అడవులు కాదు చాలా దూరంగా ఉన్నాయి. అవన్నీ ఖాళీ భూములు అని ప్రభుత్వం చెప్తుంది..కానీ అవి మడ అడవుల పరిధిలోకి వస్తాయని పర్యావరణవేత్తలు అంటున్నారు… బయో డైవర్సిటీ యాక్ట్ 2014 ప్రకారం మడ అడవులను ధ్వంసం చేయడం చట్ట విరుద్ధం..2016 సుప్రీం తీర్పు ప్రకారం మడ అడవులను రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించాలి.. కేంద్ర రాష్ట్ర అటవీ శాఖలను స్టేట్ గవర్నమెంట్ జిల్లా కలెక్టర్.ను ప్రతివాదులుగా చేర్చారు.. అప్పట్లో ఎన్జీటీ ఐదుగురు అధికారులతో కమిటీ వేసింది… తీర ప్రాంత నియంత్రణ జోన్ ఎక్కడ వరకు చూడాలని ఆ కమిటీ అధికారులను కోరింది. మొత్తానికి తీర ప్రాంత నియంత్రణ జోన్ గుర్తించడానికి కాలయాపన చేయడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పర్యవేక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.. ఆ ప్రాంతాన్ని చదును చేసి రెండు ఏళ్ల క్రితమే పట్టాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఇప్పటికీ కేసు కొలిక్కి రాకపోవడంతో అక్కడ అలాగే పెండింగ్ లో ఉండిపోయాయి.
Keerthy Suresh: పెళ్లి పీటలెక్కనున్న మహానటి.. వరుడు ఎవరంటే?