Nara Lokesh: దేశంలోనే అత్యధికంగా ఏపీలో ‘వ్యాట్’ బాదుడే బాదుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలోనే వ్యాట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు లోకేష్ ఆరోపించారు. ఇకనైనా వ్యాట్ తగ్గించి బాదుడే బాదుడిని ఆపాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై భారాలు తగ్గిస్తుంటే ఏపీలో ఒక్కసారి కూడా తగ్గించకుండా మరింతగా పన్నులు పెంచడం సమంజసం కాదన్నారు.
Pawan Kalyan: జగన్ సర్కార్ కూడా పెట్రోల్ రేట్లను తగ్గించాలి
Also Read
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు తగ్గించి వాటి ధరలు తగ్గేలా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని లోకేష్ అభిప్రాయపడ్డారు. కేంద్రంతో పాటు 23 రాష్ట్రాలు కూడా తాము విధించిన పన్నులను తగ్గించుకున్నట్లు గుర్తుచేశారు. ప్రజలపై ధరల భారాన్ని తగ్గించి ఊరట కలిగిస్తున్నాయని తెలిపారు. టీడీపీ హయాంలో ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించడానికి రూ.4 వ్యాట్‌ను రూ.2కి తగ్గించామన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువగా పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్ విధిస్తున్నారన్నారు. వ్యాట్‌కు తోడు రోడ్డు సెస్ అంటూ రూపాయి వసూలు చేసి దేశంలోనే ఎక్కువగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరల పేరుతో సామాన్యులను దోచుకుంటున్నారని లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీ వల్ల రవాణా రంగంపై ఆధారపడిన అన్ని రంగాలూ తీవ్ర నష్టాల్లోకి వెళ్లాయన్నారు. పన్నుల రూపంలో పెట్రోల్, డీజిల్‌పై ప్రజలను దోచుకోవాలన్న జగన్ ప్రభుత్వం దురాశ కారణంగా నిత్యావసరాలు ధరలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మానవతా ధృక్పథంతో ఆలోచించి బాదుడే బాదుడుకి స్వస్తి చెప్పాలని లోకేష్ హితవు పలికారు.
తాజావార్తలు
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
-
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!