Nara Lokesh: ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల మౌత్ పబ్లిసిటీకి వైనాట్ 175 అని అన్న వారిని 11కి దించారని సెటైర్లు వేశారు. డ్రైవర్ గా నందమూరి తారక రామారావు, బాలయ్య, పవన్ కళ్యాణ్ లు కూడా నటించారు.. ఈ సందర్భంగా ఆటోల వెనక ఉండే కొటేషన్లపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎప్పుడు ఆటోల వెనుక ఉన్న కొటేషన్లు నేను చదువుతాను.. ఒక ఆటో డ్రైవర్ వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే దేవుడు కురిపిస్తాడు అని చెప్పోద్దు.. మొక్క నాటితే వర్షం దాని వల్ల కురుస్తుందని చెప్పారు.. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని ఆటో డ్రైవర్ అనుకుంటారు.. ఇక, ఆటోలో బ్యాగ్ మర్చిపోతే జాగ్రత్తగా పోలీసుకలు అప్పగిస్తారు ఆటో డ్రైవర్లు అని నారా లోకేష్ వెల్లడించారు.
Read Also: Radhika Apte: “నీకు దురద పెడితే నేను గోకి పెడతాను” –స్టార్ హీరో బండారం బయట పెట్టిన రాధిక
అయితే, కొన్ని కామెడీ కొటేషన్లు ఆటోల వెనుక రాస్తారు అని మంత్రి లోకేష్ తెలిపారు. అప్పుచేసి కొన్నా.. నన్ను చూసి ఏడవద్దు రా అని కూడా రాస్తారు.. యువగళం అప్పడు ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా మాట్లాడాను.. కుడి చేత్తో రూ. 10 వేలు ఇచ్చి ఎడమ చేత్తో రూ. 20వేలు గ్రీన్ టాక్స్ రూపంలో గత ప్రభుత్వం లాగేసిందన్నారు. గుంతలు లేకుండా చూడడం ద్వారా ఆటో ప్రమాదాలు నివారించాం.. ఆటో చార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసి వారికి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుంది.. మహిళలను కించపరిచేలా రోజా మాట్లాడారు.. దానిపై హమీద్ భాషా రోజా వద్దకు వెళ్లాలనుకున్నారు.. అయితే, ఆయన ఆటోను పోలీసులు సీజ్ చేశారు.. అతడ్ని ఆదుకోవాలని చంద్రబాబు చెప్పారు.. పేదవాడి కారు ఆటోనే, చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లేది ఆటోలోనే బస్సు, రైలు ఎక్కాలన్నా ఆటోలు ఉండాల్సిందేనని లోకేష్ చెప్పుకొచ్చారు.