ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రచ్చగా మారాయి.. అధికార పార్టీ నేతలు కేటీఆర్‌పై ఫైర్ అవుతుంటూ.. ప్రతిపక్షాలు మాత్రం నూటికి నూరు శాతం ఇది నిజం.. కేటీఆర్ వాస్తవాలే మాట్లాడారని పేర్కొన్నారు.. ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు..
Read Also: Breaking: బీటెక్ విద్యార్థిని హత్య కేసులో సంచలన తీర్పు
‘కేటీఆర్ నోట… జగన్ విధ్వంసపాలన మాట… అట్టుంటది ఒక్క చాన్స్తోని..’ అంటూ కేటీఆర్ వీడియోను షేర్ చేశారు నారా లోకేష్.. కాగా, క్రెడాయ్ ఆధ్వర్యంలో హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్‌లో జరుగుతోన్న అభివృద్ధి, అవకాశాలు.. ఇతర అంశాలపై మాట్లాడుతూ.. ఏపీని ఉద్దేశించి పరోక్షంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నాకో మిత్రుడు ఉన్నాడు.. ఆయన సంక్రాంతి పండుగకు పక్క రాష్ట్రానికి వెళ్లాడు.. ఆయనకు అక్కడ తోటలు, ఇల్లు ఉంది.. వెళ్లి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసిండు.. కేటీఆర్ గారు మీరు ఒక పనిచేయండి… రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నాలుగు బస్సులు పెట్టి పక్క రాష్ట్రానికి పంపించండి.. అని చెప్పారు.. ఎందుకని అడిగితే.. అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయాయి.. అన్యాయంగా.. అధ్వానంగా ఉందని చెప్పాడు.. మళ్లీ తిరిగొచ్చిన తర్వాతే ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉందని.. పక్క రాష్ట్రాన్ని చూసివస్తేనే.. మనం చేస్తున్న అభివృద్ధి తెలిసి వస్తుందని చెప్పారని గుర్తుచేసుకున్నారు కేటీఆర్.