Students Clash: నంద్యాల జిల్లా అవుకు మండలం చెర్లోపల్లె గ్రామంలోని జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే, ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి విద్యార్థి కార్తీక్‌పై అదే తరగతికి చెందిన జకరయ్య, సాలేం అనే ఇద్దరు స్టూడెంట్స్ దాడికి పాల్పడ్డారు. పరస్పరం మాటా మాట పెరిగి, పిడిగుద్దులకు దిగిన ఘర్షణలో కార్తీక్ కాలి ఎముక విరిగినట్లు తెలుస్తుంది.
Read Also: WCL 2025: ఘోరంగా విఫలమైన టాప్ ఆర్డర్.. తేలిపోయిన భారత ఛాంపియన్స్.. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి!
అయితే, ఈ ఘటన గురించి విద్యార్థులు చెప్పినా కూడా, పాఠశాల ఉపాధ్యాయులు విషయాన్ని బయటకు పోక్కకుండా రహస్యంగా ఉంచారు. ఇక, విషయం తెలుసుకున్న కార్తీక్ తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి ఉపాధ్యాయులను ప్రశ్నించారు. అంతేకాదు, ఇది వరకు కూడా అదే పాఠశాలలో విద్యార్థుల మధ్య గొడవలు చోటు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘర్షణపై పోలీసులకు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఇక, గాయపడిన స్టూడెంట్ కార్తీక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, పాఠశాలలో పెరుగుతున్న గొడవలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పాఠశాల పరిపాలనపై అధికారులు నజర్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.