WCL 2025: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 సీజన్‌లో భారత ఛాంపియన్స్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా ఛాంపియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా డక్‌వర్థ్ లూయిస్ (DLS) పద్దతిలో 88 పరుగుల తేడాతో భారీగా ఓటమి పాలైంది. మ్యాచ్ చివరలో ఫ్లడ్‌లైట్ల లోపం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడడంతో డక్‌వర్థ్ లూయిస్ పద్దతిలో విజేతను నిర్ణయించారు.
Read Also:Hari Hara Veeramallu : వైజాగ్ బీచ్ రోడ్ పై పవన్ హవా.. పవన్ ఫ్యాన్స్‌కి మరో బంపర్ ట్రీట్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ అద్భుతంగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అతను కేవలం 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 అజేయంగా నిలిచాడు. ఇతనికి తోడుగా స్మట్స్ (30), రుదాల్ఫ్ (24), అమ్లా (22), డుమిని (16) మద్దతు ఇచ్చారు. భారత బౌలర్లలో పీయూష్ చావ్లా, యూసఫ్ పఠాన్ రెండు వికెట్లు తీయగా, అభిమన్యు మిథున్ ఒక వికెట్ తీశాడు.
Double Decker Bus: అలా ఎలా పోనిచ్చావ్ డ్రైవర్ అన్నా.. బ్రిడ్జ్‌ను ఢీకొన్న బస్సు.. 15 మంది గాయాలు.!
208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఛాంపియన్స్‌కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (2), శిఖర్ ధావన్ (1) త్వరగా ఔటయ్యారు. అంబటి రాయుడు డకౌట్ కాగా, సురేశ్ రైనా (16), యూసఫ్ పఠాన్ (5), ఇర్ఫాన్ పఠాన్ (10) కూడా నిరాశపరిచారు. జట్టు కష్టసమయంలో స్టువర్ట్ బిన్నీ ఒంటరిగా పోరాడుతూ 39 బంతుల్లో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయినా చివరి బ్యాట్స్‌మెన్స్ నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో 111 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది భారత్. చివర్లో ఫ్లడ్‌లైట్ల సమస్య తలెత్తడంతో మ్యాచ్ నిలిపివేయగా, డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 88 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది.
South Africa Champions seal a massive 88-run win (DLS) as one of the floodlights goes off mid-game.
[Cricket, CricTracker, India Champions, South Africa Champions, WCL 2025] pic.twitter.com/NKidC2axgU
— CricTracker (@Cricketracker) July 22, 2025