నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కొణిదెల అనే గ్రామం ఉంది.. ఆ గ్రామంలో తాగునీటి ట్యాంకు నిర్మాణానికి పవన్ కల్యాణ్ ట్రస్టు ద్వారా 50 లక్షల రూపాయలు ఇచ్చారు.. ఎన్నికలకు ముందు నియోజకవర్గ పర్యటనలో పవన్ కల్యాణ్ కొణిదెల గ్రామాన్ని సందర్శించినప్పుడు తన ఇంటిపేరుతో ఊరు ఉందన్న విషయం తనకు తెలియదని.. తాము అధికారంలోకి వస్తే ఈ కొణిదేల గ్రామాన్ని దత్తాతకు తీసుకుంటానని హామీ ఇచ్చారు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామానికి వెళ్లనున్నారు. కొణిదెల గ్రామంలో పవన్ తన సొంత నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలతో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కొణిదెల గ్రామ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పవన్ ఇంటి పేరు ‘కొణిదెల’ అన్న విషయం తెలిసిందే. జనసేన…