CM Chandrababu: శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న నీటితో జలాశయం వద్ద కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈరోజు కృష్ణనదికి జల హారతులు ఇచ్చి, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టులోని 6, 7, 8, 11 నెంబర్ల రేడియల్ గేట్లను తెరచి నీటిని కిందికి వదిలారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రిజర్వాయర్లను దేవాలయంగా భావిస్తాను.. జీవితానికి సంపద ఇచ్చేది జలాశయాలు.. టీడీపీ హయాంలోనే మెజారిటీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించాం.. కృష్ణ, గోదావరి, పెన్నా , వంశధార నదులు ఉన్నాయి.. కృష్ణా నదికి నీళ్లు రాకపోయినా.. గోదావరి నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు నీరు తెస్తే కరువు ఉండదు అని తేల్చి చెప్పారు. గోదావరి-బనకచర్ల నా సంకల్పం.. 554 టీఎంసీల నీళ్లు ఇప్పుడు నిలువ ఉన్నాయి.. రాబోయే రోజుల్లో 450 టీఎంసీల నీళ్లు వస్తే అన్ని జలాశయాలు కలకళలాడుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Operation Sindoor: యుద్ధంలో చైనా పాకిస్థాన్‌కు సహాయం చేసిందా? చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిటీ..
ఇక, పోలవరం ఏపీకి పెద్దవరం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏటా 2 వేల టీఎంసీలు సముంద్రంలోకి వెళ్తున్నాయి.. ఏపీ 200 టీఎంసీలు, తెలంగాణ 200 టీఎంసీలు వాడుకోవచ్చు అన్నారు. రాయలసీమ ఒకప్పుడు రాళ్లసీమ.. ఇప్పుడు కాదు.. రాయలసీమ అభివృద్ధికి నా దగ్గర బ్లూ ప్లింట్ ఉందన్నారు. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి.. మెట్ట పంటలు వేస్తే ఆదాయం పెరుగుతుందని సూచించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తా.. సంక్షేమం , అభివృద్ధి రెండు కళ్ళు అని చెప్పా.. అదే చేస్తున్నాను.. వేరే పార్టీకి, టీడీపీకి తేడా చూడాలి.. ఐదేళ్లలో పింఛన్ 200 నుంచి 2 వేలు చేసా.. పింఛన్ వెయ్యి పెంచడానికి గత ప్రభుత్వం ఐదేళ్లు తీసుకుంది.. కానీ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్ అందజేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Bhatti Vikramarka : కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి.. భట్టి ఫైర్
అలాగే, భూగర్భ జలాలు పరిరక్షించాలి.. అప్పుడు కరువు అనే మాట ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక, 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు అందజేస్తున్నాం.. ఇంటికి సోలార్ పెట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఏపీ ప్రజల తరపున మల్లికార్జున స్వామిని వేడుకుంటున్నాను.. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా.. ఏ ప్రభుత్వం వల్ల జీవితాలు బాగు పడతాయో.. వారికి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే, తల్లికి వందనం ఇచ్చినందుకు రెండు వేళ్ళు చూపించి స్వాగతం పలికారు.. గత ఐదేళ్లు ప్రజల మొహల్లో నవ్వు మాయం అయింది.. ఇపుడు అందరి ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది అన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత అందికి తల్లికి వందనం ఇచ్చాము.. 7 మంది పిల్లలు ఉంటే లక్ష 5 వేలు ఇచ్చాం.. జనాభా పెంచాలి.. ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారి భారాన్ని ప్రభుత్వం పంచుకుంటుందన్నారు.
