Fire Catches Car: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఆలయానికి వెళ్తుండగా పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది.. అయితే, ఈ ప్రమాదంలో తృటిలో తప్పించుకుని బయటపడ్డారు ప్రయాణికులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో మంటలు చెలరేగి భక్తుల కారు దగ్ధం అయ్యింది.. గుంటూరుకు చెందిన భక్తులు ఇన్నోవా కారులో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.. చిన్నారుట్ల సమీపంలో కారు ఇంజిన్ భాగంలోని బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ తో పొగలు వచ్చాయి.. అయితే, పొగలు రావడంతో అప్రమత్తమైన భక్తులు వెంటనే ఆ కారులో నుంచి బయటకు దిగారు.. ఇక, క్షణాల్లో మంటలు చెలరేగి కారు మొత్తం వ్యాపించాయి.. కారులో నుంచి భక్తులు దిగడంతో ప్రాణాపాయం తప్పింది.. మంటలు చెలరేగి ఇన్నోవా కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది.. ప్రాణాపాయం తప్పడంతో అటు అధికారులు.. ఇటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.. అసలే వేసవి కాలం కావడంతో.. ఫారెస్ట్‌లోకి మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు..
Read Also: Kadiyam Srihari : జనగామ జిల్లా రాజకీయ వేడి… కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు