భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. మాకు తెలియకుండా ఎవరైనా పదవులు తెచ్చుకుంటే వారిని నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టనివ్వం అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. పదవులు ఇవ్వాలనుకుంటే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వండి అని సూచించారు.. లేకపోతే అసలు పని చేయని వాళ్లకి పదవులు ఇస్తే అది కరెక్ట్ కాదు అని హితవుచెప్పారు..