ఏపీలో ఉప ఎన్నిక మాటున నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. సీపీఐ అగ్రనేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో జగన్ పోటీచేయాలన్నారు నారాయణ. 900 రోజులుగా రైతులు, మహిళలు ఉద్యమాలు చేస్తున్నా జగన్ ప్రభుత్వం కిరాతకంగా వ్యవహరిస్తోంది. న్యాయస్థానాలు సానుకూలంగా స్పందిస్తున్నా ముఖ్యమంత్రి వితండ వాదన చేస్తుండడం దారుణంగా వుందన్నారు.
ఆనాడు అమరావతిలో రాజధానిని అంగీకరించారు. ప్రతిపక్షనేతగా ముందు అంగీకరించి ఇప్పుడు ఆడినమాట తప్పుతారా..? మోడీ కాళ్లు మోక్కినంత మాత్రాన జైలుకు పోకుండా ఎవరైనా ఆపగలరా..?ఆత్మకూరులో నిలబడాలని సవాలు చేయడం కాదు.. అమరావతిలో జగన్ పోటీ చేస్తే వాస్తవం తెలుస్తుంది.ఓట్లపై ప్రేమతోనే కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టారు.
కోనసీమ తిరుగుబాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద జరిగిందే.. అంబేద్కర్ పేరుకు అనుకూలమో వ్యతిరేకమో కాదు.సామాజిక న్యాయం అనే పేరుతో కార్పోరేషన్లు పెట్టి ఏం ఉపయోగం.బీసీలకు అధికారం ఎక్కడిది..?వీధినాటకంలో భుజకిరీటాలు ధరించినట్టే ఉంది బీసీ కార్పోరేషన్ల పరిస్థితి.ప్రస్తుతం ఉద్యోగాలు పోగొట్టడానికే జాబ్ క్యాలెండర్ ఉందని ఎద్దేవా చేశారు.
విశాఖ ఉక్కు, కృష్ణపట్నం పరిశ్రమలు ప్రైవేటు పరం అవుతున్నాయి. ప్రత్యేక హోదా అడిగితే జగన్ జైలుకు వెళ్లాల్సిందే. మోడీ కాళ్లకు మొక్కి తెలుగువారి ఆత్మగౌరవాన్ని జగన్ తాకట్టు పెట్టారని నారాయణ మండిపడ్డారు.
Jamia Masjid: కర్నాటకలో ఉద్రిక్తత.. శ్రీరంగపట్టణంలో 144 సెక్షన్