అరుదైన ఘనత.. ‘యూనివర్సల్ వ్యాక్సిన్’గా కొవాగ్జిన్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. ఇది గుర్తించిన అన్ని దేశాలు వ్యాక్సిన్ల ఉత్పత్తి, వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి.. ఇక, భారత్‌లో దేశీయంగా తయారై.. అనుమతి పొందిన వ్యాక్సిన్లలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ఒకటి… తాజాగా, మరో అరుదైన ఘనత సాధించింది కొవాగ్జిన్.. చిన్నారులు, వయోజనులకు పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్‌ టీకా ‘యూనివర్సల్ వ్యాక్సిన్‌’గా గుర్తింపు పొందింది.. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ వెల్లడించింది..

Read Also: రియల్ కింగ్ ”హైదరాబాద్”

కొవాగ్జిన్‌ అరుదైన ఘనతపై స్పందించిన భారత్‌ బయోటెక్.. కొవాగ్జిన్ ఇప్పుడు చిన్నారులు, వయోజనులకు యూనివర్సల్ వ్యాక్సిన్.. కోవిడ్‌కు గ్లోబల్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలన్న మా లక్ష్యం దీంతో నెరవేరిందని ప్రకటించింది.. ఇక, వ్యాక్సిన్‌ అభివృద్ధి, లైసెన్సులకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తి అయినట్టు కూడా వెల్లడించింది భారత్ బయోటెక్… కాగా, విజృంభిస్తోన్న కరోనాకు చెక్‌ పెట్టేందుకు.. 2021 జనవరిలో టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 154 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ జరగగా.. అందులో 12 శాతం టీకాలు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్​డోసులు ఉన్నాయి.. ఈ మధ్యే 15-18 ఏళ్ల వారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలోనూ కొవాగ్జిన్ టీకానే ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles