Naga Babu: వైసీపీ అసమర్ధ పాలనకు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Babu: ఏపీ ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించడం లేదని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. తమ సమస్యలను పరిష్కరానికి గవర్నర్ కల్పించుకొని చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడంలేదంటూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు.
Read Also: Revanthreddy : అప్పుడు గవర్నర్ స్పందిస్తే.. ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి అని నాగబాబు చురకలు అంటించారు. డీఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక ఆందోళన చేయడానికి అనుమతి దొరకని పరిస్థితులలో ఉద్యోగులు గవర్నర్‌ను కలిశారని నాగబాబు ఆరోపించారు. వైసీపీ అసమర్థ పాలనకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలు కలిగి ఉన్న గవర్నర్‌కు తమ పరిస్థితి మొరపెట్టుకునే స్థాయికి ఉద్యోగులను తీసుకొచ్చారని నాగబాబు విమర్శించారు. కాగా ఈనెల 21, 22 తేదీల్లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జనసేన నేత నాగబాబు పర్యటించనున్నారు. ఈ నెల 21న కర్నూలు జిల్లా వీరమహిళల సభలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం జనసైనికుల సభకు హాజరవుతారు. ఈ నెల 22న అనంతపురం జిల్లాలో వీరమహిళలు, జనసైనికుల సభల్లో పాల్గొంటారు.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్‌గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!