CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు నామినేషన్లు వేసుకోవాలని చెబుతున్నప్పటికీ, వైసీపీ నేతలు దాడులు చేసి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, రాష్ట్రపతి పాలన రావాలనే ధోరణితో వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజకీయ ముసుగులో ఒక నేరస్తుడు పనిచేస్తున్నాడని వ్యాఖ్యానిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
జగన్ బెంగళూరు నుంచి వచ్చి మూడు రోజుల పాటు ప్రెస్మీట్లు పెట్టి తిరిగి వెళ్లిపోతారని చంద్రబాబు అన్నారు. అసత్యాలను వందసార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగమని, తాను గత 50 సంవత్సరాలుగా ఎన్నికల ప్రక్రియను గమనిస్తున్నానని తెలిపారు. కాలక్రమేణా ఎన్నికల సంస్కరణల్లో అనేక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఒకప్పుడు ఎన్నికల నిర్వహణను ఒక అధికారి పర్యవేక్షించేవారని, ప్రస్తుతం స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను నియమించే స్థాయికి వ్యవస్థ అభివృద్ధి చెందిందని వివరించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తమ తీర్పును ఎన్నికల ద్వారా వెల్లడిస్తారని అన్నారు చంద్రబాబు.
Also Read
- AP ZPTC, MPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లపై కూటమి కసరత్తు.. ఆశావహుల నామినేషన్లతో కూటమిలో టెన్షన్..
- AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
- Andhra Pradesh Cyclone Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీకి తుఫాన్ ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
గత పదేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి తీవ్రంగా దిగజారిందని చంద్రబాబు విమర్శించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లాయని వ్యాఖ్యానించారు. గతంలో శాంతిభద్రతలకు విఘాతం బాహ్య శక్తుల నుంచి ఎదురయ్యేదని, ఇప్పుడు రాజకీయ వ్యవస్థ నుంచే సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. రాజకీయ నాయకులే నేరాలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇలాంటి పరిణామాల వల్ల కొన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని పేర్కొన్నారు. గతంలో ఫ్యాక్షన్ సమస్య కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండేదని గుర్తుచేశారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రాంతంలో ఫ్యాక్షన్ ఉన్నప్పటికీ, ఆయన బయటకు వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించేవారని వ్యాఖ్యానించారు. మంచి ప్రభుత్వాల ద్వారానే సుపరిపాలన సాధ్యమవుతుందని అన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందకపోవడానికి ఫ్యాక్షనిజం ప్రధాన కారణాల్లో ఒకటని పేర్కొన్నారు.
గత ఏడు దశాబ్దాలుగా శాంతిభద్రతల సమస్యలు రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టాయని చంద్రబాబు అన్నారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించానని తెలిపారు. ఈ క్రమంలోనే తిరుమలలో తనపై దాడి జరిగిందని గుర్తుచేశారు. కొత్తకొత్త సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. 2019 నాటికి రాష్ట్రంలో పరిస్థితులు పరాకాష్టకు చేరాయని చంద్రబాబు ఆరోపించారు. ఆ సమయంలో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని, విధ్వంసాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
-
Donald Trump: ట్రంప్‌ను జైల్లో బంధించిన ఇరాన్..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
-
Team India: మాకు విశ్రాంతి వద్దు, ప్రతి మ్యాచ్ ఆడుతాం.. టీమిండియా సీనియర్ ప్లేయర్స్ భయం అదేనా?
-
Vangaveeti Radha: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. లైట్ తీసుకుంటా..!
-
Sonia Gandhi Love story: రాజీవ్ గాంధీతో మొదటి చూపులోనే ప్రేమ.. తమ లవ్‌స్టోరీపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!