గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధిస్తాం…రాష్ట్రానికి.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మంచి పేరు తీసుకొస్తాను అని వెల్లడించారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు… సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.. 2026 వరకూ పాత జిల్లాల్లోనే జెడ్పీలను కొనసాగించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైల్ పై మొదటి సంతకం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పంచాయితీల్లో తాగునీరు పారిశుద్ధ్యం మెరుగు పరుస్తామని…