ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. వివిధ అంశాలపై టీడీపీ నేతలు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. రాష్ట్రం పరువు తీసే నిర్ణయం బొత్స ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు. హరీష్ రావు వ్యాఖ్యలపై ఓ సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స పార్టీ పరువు, ప్రభుత్వ పరువు ఎందుకు తీయాలనుకున్నారో ఆయనకే తెలియాలి. బొత్స చెప్పినట్లు హరీష్ రావు ఏపీకి వచ్చి నలుగురు టీచర్లతో మాట్లాడితే రాష్ట్రం పరువు పోవటం ఖాయం అన్నారు అశోక్ బాబు.
ఉపాధ్యాయులకు సమ్మతమైన ఏ ఒక్క అంశమూ బొత్స మాట్లాడలేదు.ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని తెలంగాణ మంత్రి వచ్చి పరిశీలించాలి. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయుల్ని కాపలా పెట్టిన పరిస్థితులు హరీష్ రావుకు బొత్స వివరిస్తారా..? ప్రభుత్వం ఏపీలో ఉపాధ్యాయులతో బోధనేతర కార్యక్రమాలే ఎక్కువ చేయిస్తోంది. రాష్ట్రంలో మా పరిస్థితి బాగోలేదని ఉపాధ్యాయ సంఘాలే ముక్తకంఠంతో చెప్తుంటే హరీష్ రావుకు బొత్స కొత్తగా ఏం చూపిస్తారన్నారు.
Read Also: largest flower : ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు
ఏపీలో టీచర్లను ఉదాహరణగా చూపి, తెలంగాణ టీచర్లని హరీష్ రావు భయపెట్టడం రాష్ట్ర దుస్థితికి అర్థంపడుతోందన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. వివిధ కమిటీలతో కాలయాపన చేయడం తప్ప ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేసింది శూన్యం. దేశంలో మరే రాష్ట్రంలో లేని దుస్థితి ఏపీలో ఉపాధ్యాయులకు ఉందన్నారు అశోక్ బాబు.
Read Also: CM JaganMohanReddy: వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు ప్రారంభం