Nallapareddy Prasanna Kumar Reddy: ఆ 40 మంది ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టండి..! టీడీపీకి ఇదే నా సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nallapareddy Prasanna Kumar Reddy: ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ.. ఇక చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ చెప్పుకొస్తుందే.. అయితే, టీడీపీ నేతలకు సవాల్ చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. దాదాపు 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఆంబోతు అచ్చెన్నాయుడుకు మెదడులో తెలివి లేదు.. కానీ, మోకాల్లో ఉంది అంటూ ఫైర్ అయ్యారు.. దేనికి పనికిరాని దద్దమ్మ అచ్చెన్నాయుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ధైర్యం ఉంటే మీతో టచ్ లో ఉన్న 40 మంది వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టండి అంటూ సవాల్ విసిరారు.. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడే మైండ్ గేమ్ గా అభివర్ణించిన ఆయన.. ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారంటూ ఒక పెద్ద నాటకానికి తెరతీస్తున్నారు అంటూ దుయ్యబట్టారు.
Read Also: TDP: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం.. ఎన్నో సవాళ్లు, సంక్షోభాలను దాటుకుంటూ ప్రయాణం
Also Read
- Pawan Kalyan - Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
డబ్బుకు అమ్ముడుపోయిన వారు పార్టీ నుంచి వెళ్లిపోయారు.. చెరో పది కోట్లు తీసుకుని తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు అంటూ పార్టీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలపై మండిపడ్డారు ప్రసన్నకుమార్‌రెడ్డి.. ఇక, మాది రాజకీయ కుటుంబమైనా వైఎస్ జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచానని పేర్కొన్నారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కాగా, ఈ మధ్య నెల్లూరు జిల్లాకు చెందిన మరో పెద్దారెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేసిన నేపథ్యంలో.. ఆ వార్తలపై స్పందించిన ఆయన.. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం సరికాదన్న ఆయన.. మాది రాజకీయ కుటుంబం.. నా మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. మంత్రిగా పనిచేశా.. సీఎం వైఎస్ జగన్ నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తారు.. అసలు నేను పార్టీ మారడం ఏంటి? అని ప్రశ్నించారు. 2012లో ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి గెలిచా.. నా చివరి రక్తపు బొట్టు వరకూ వైఎస్ జగన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు నల్లపరెడ్డి… వాళ్ల ఇంట్లో బిడ్డలా చూసుకుంటున్నారు.. నెల్లూరు బ్యారేజ్ కు మా నాన్న శ్రీనివాసులు రెడ్డి పేరు పెట్టారు అని గుర్తుచేశారు. కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుని ద్రోహం చేశారని మండిపడ్డ ఆయన.. ఈ గేమ్ చంద్రబాబు ఆడుతున్నాడు.. గతంలో ఆయన సీఎం అయ్యేటప్పుడు కూడా ఇదే గేమ్ ఆడారంటూ మండిపడిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
-
IRDAI New Insurance Rules: హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్‌పై IRDAI కొత్త ప్రతిపాదనలు.. పాలసీదారులకు ఏమి మారనుంది?
-
Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ – ఓపెన్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?