MLA Anil Kumar Yadav Challenges TDP Over His Assets: నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో టీడీపీపై ధ్వజమెత్తారు. నెల్లూరులో సభ కోసం రెండు రోజుల పాటు టీడీపీ నేతలు కసరత్తు చేశారని.. ఒకరోజు పాదయాత్ర విరామం ఇచ్చారని పేర్కొన్నారు. సాధారణంగా టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహం వద్ద సమావేశం పెడతారని.. కానీ ఈసారి ఎన్టీఆర్ విగ్రహం మీదుగా పాదయాత్ర వెళుతున్నా, ఆయనకు మాల కూడా వేయలేదని విమర్శించారు. తాను వెయ్యి కోట్లు సంపాదించానని ఆరోపణలు చేశారని.. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే ఒక రూపాయి ఎక్కువ సంపాదించలేదని స్పష్టత నిచ్చారు. తాను వెంకటేశ్వర స్వామి వద్ద ప్రమాణ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు.
Hookah Centre: కేఫ్ ముసుగులో హుక్కా సెంటర్.. కాప్స్ అదుపులో ముగ్గురు
సిటీలో తనకు 80 ఎకరాలు ఉన్నాయని లోకేష్ ఆరోపించారని, తనకు అక్కడ కేవలం 13 ఎకరాలు మాత్రమే ఉన్నాయని అనిల్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. అందులో కూడా కొంత భాగం అమ్మేశానని, తిరుగాళ్ళమ్మ గుడి వద్ద మూడెకాలు అమ్మానని తెలిపారు. వైసీపీ కార్పొరేటర్లు లేఔట్‌లు వేస్తే.. దాంతో తనకేంటి సంబంధమని ప్రశ్నించారు. వైద్యుడుగా ఉన్న తన సోదరుడు అశ్విన్ వ్యాపారం చేసి సంపాదిస్తే.. తనకు అంటగట్టడం ఎంతవరకు సబబు అని నిలదీశఆరు. తనకు దానంలో ఐదు ఎకరాల స్థలం ఎక్కడుందో చూపించాలని డిమాండ్ చేశారు. చెన్నైలో తాను బాడుగ ఇంట్లో ఉన్నానని, చదువు కోసం అక్కడ ఉండాల్సి వచ్చిందని చెప్పారు. టీడీపీ ఆరోపించినట్టు తనకు రూ.50 కోట్ల ఇల్లు ఎక్కడుందో చూపించాలని, చూపిస్తే అక్కడైనా చేరుతానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ సభల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ ఎందుకు కనపడలేదని అడిగారు.
Anu Gowda: నటి అనుగౌడపై దాడి.. రక్తం వచ్చేలా కొట్టారు
రూరల్‌లో అక్రమాలన్నీ ‘స్వాతిముత్యం’ కమలహాసన్ చేస్తున్నారని అజీజ్ చెప్పారని.. ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ అబద్ధాలా? అని అనిల్ కుమార్ ప్రశ్నించారు. ఈ స్వాతిముత్యం పార్టీలో ఉన్నారో లేదో ఇప్పుడే చెప్పాలని డిమాండ్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సీఎం జగన్ రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం.. గొంతు కోయడమా? అని మండిపడ్డారు. ఓడి పోతానని తెలిసి రూరల్‌లో పోటీ చేసిన అబ్దుల్ అజీజ్‌ను పట్టించుకోకపోవడం గొంతు కోయడమా? అని నిలదీశఆరు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఊడగొట్టాలని నారాయణ తనకు రూ.50 లక్షలు పంపించారని, అయితే తాను వాటిని వెనక్కి పంపించానని చెప్పుకొచ్చారు.