జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి ఆర్ కె రోజా. ఎన్టీవీతో మంత్రి రోజా మాట్లాడుతూ.. రుషికొండపై నిబంధనల ప్రకారమే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అన్ని రకాల అనుమతులు తీసుకున్నాం. నిబంధనలకు అనుగుణంగానే తవ్వకాలు అని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. పవన్ కళ్యాణ్ అవగాహన లేని వ్యక్తి. ప్రతిపక్ష నాయకుడి పై దాడి వెనుక కుట్ర కోణం ఉండకుండా ఎలా ఉంటుంది?మేం పూర్తి చేసిన టిడ్కో ఇళ్ళ దగ్గరకు వెళ్ళి సెల్ఫీ తీసుకుని చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. రుషి కొండ పై ఏడు బ్లాకులకు అనుమతి ఉంటే మేము నాలుగు బ్లాకుల్లో నే పనులు చేపట్టాం. మిగిలిన బ్లాకుల్లో కూడా పనులు చేపడతాం. గీతం యూనివర్సిటీలో లోకేష్ తోడల్లుడి భూములు ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నాడు అని విమర్శించారు మంత్రి రోజా.
Read Also: Shakuntalam: మొదటి రోజు అంత తక్కువా… ఇలా అయితే ఒడ్డున పడడం కష్టమే
గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు ఇటీవల ప్రయత్నించిన సంగతి తెలిసిందే. రుషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వైరల్ అయ్యాయి. రుషికొండ తవ్వకాలపై స్పందించిన ఆయన.. రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా..? అని ప్రశ్నించారు.. చెట్లు, కొండలను నరికేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణం అంటూ ఆరోపించారు.. రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాధానం చెబుతుందా..? లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్‌ను అంటిస్తారా? అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్. ఈ ట్వీట్లపై కౌంటర్ వేశారు మంత్రి రోజా.
Read Also: Pawan Kalyan: రుషికొండ తవ్వకాలపై పవన్ సెటైర్లు..