లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా రూపొందింది. శకుంతలా దేవిగా సమంతా నటించగా, దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించాడు. ఈ ఇద్దరు కొడుకు భరతుడిగా ‘అల్లు అర్జున్’ కూతురు ‘అల్లు అర్హా’ నటించింది. పలుమార్లు వాయిదా పడిన శాకుంతలం సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు భారి ప్రమోషన్స్ జరుపుకున్న ఈ పాన్ ఇండియా సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా 3Dలో శాకుంతలం సినిమా చూసిన వాళ్లు ఆ టెక్నికల్ స్టాండర్డ్స్ చూసి విమర్శలు చేస్తున్నారు. సమంతా, అల్లు అర్హా తప్ప మాట్లాడుకోవడానికి ఏమీ లేని విధంగా గుణశేఖర్ శాకుంతలం సినిమాని తెరకెక్కించాడని ట్విట్టర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో శాకుంతలం సినిమాకి ఈవెనింగ్ నుంచి షోస్ డల్ అయ్యాయి. దీంతో ఓవరాల్ గా శాకుంతలం సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అయిదు కోట్ల గ్రాస్ ని మాత్రమే రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం. సమంత సినిమాకి మొదటి రోజు అయిదు కోట్లు అనేది చాలా తక్కువ అనే చెప్పాలి, అఫీషియల్ ఫిగర్స్ ఇంకా బయటకి రాలేదు కానీ అయిదు కోట్లకి కాస్త అటు ఇటుగానే ఉండే ఛాన్స్ ఉంది. సెకండ్ డే శాకుంతలం సినిమా పుంజుకోని, మొదటి వీకెండ్ ని కాష్ చేసుకుంటేనే శాకుంతలం బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవుతుంది లేదంటే ఈ సినిమా ఫ్లాప్ లిస్టులో చేరే ప్రమాదం ఉంది. శాకుంతం సినిమా థియేట్రికల్ బిజినెస్ 20 కోట్లకి జరిగిన విషయం తెలిసిందే. మరి అంత మొత్తాన్ని శాకుంతలం సినిమా రాబడుతుందో లేదో చూడాలి.