Atchannaidu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టే విధంగా వ్యవసాయ అధికారులు సూచించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. నేటి (ఆదివారం) ఉదయం అల్పపీడన ప్రభావం, పంట నష్టం, ఎరువుల లభ్యత తదితర అంశాలపై అధికారులతో ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎరువులు అందుబాటులో ఉండేవిధంగా చూడాలని ఆదేశించారు. పంట పొలాల్లో నీటి నిల్వ తొలగింపు, తేమ ద్వారా ఆశించే తెగుళ్ల నివారణకు రైతులకు సూచనలు చేయాలని పేర్కొన్నారు.
Read Also: Godavari Water Level: 39 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం.. రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక!
అలాగే, ఉపాధి హామీ పథకంలో పంట కాలువలు, డ్రెయిన్లలో తక్షణమే పూడిక తీసి నీటి సరఫరా సజావుగా సాగేలా చూడాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వెంటనే రైతులకు రక్షణ చర్యలు సూచించండి.. ఎరువులు అందుబాటులో ఉండాలి.. ఉపాధి హామీలో పంట కాలువలు పూడిక తీసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.