Jogi Ramesh: సంక్రాంతి ప్యాకేజ్ కోసమే.. చంద్రబాబు, పవన్ భేటీపై జోగి రమేశ్ కౌంటర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jogi Ramesh Satires On Chandrababu Naidu Pawan Kalyan Meeting: పవన్ కల్యాణ్, చంద్రబాబు తాజా భేటీపై మంత్రి జోగి రమేశ్ కౌంటర్ల వర్షం కురిపించారు. తానిప్పుడే కొన్ని టీవీ ఛానెళ్లలో ‘పవర్‌ఫుల్’ మీట్ అనే కొటేషన్‌తో వార్తలు చూశానని.. అది పవర్‌ఫుల్ మీట్ కాదు, పవర్‌ఫుల్ ప్యాకేజ్ అని సెటైర్ వేశారు. సంక్రాంతి ప్యాకేజ్ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడన్నారు. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా కందుకూరులో, గుంటూరులో చనిపోయిన వారిని పరామర్శిస్తారని.. చంద్రబాబు ఇంటికి పరామర్శించడానికి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. అభం శుభం తెలియని అమాయకులు చనిపోతే.. ఏ రాజకీయ నాయకుడైనా సరే వారిని పరామర్శించి, ‘నేనున్నాను’ అని ఆ కుటుంబానికి ధైర్యం చెప్తారన్నారు. కానీ.. పవన్ కళ్యాణ్ అలా కాకుండా కుప్పంలో డ్రామాలాడిన చంద్రబాబుని కలిసేందుకు హైదరాబాద్‌లో ఆయన ఇంటికి వెళ్లాడన్నారు. అసలు చంద్రబాబుకి ఏం జరిగిందని పరామర్శించడానికి పవన్ వెళ్లాడు? అని నిలదీశారు.
Gudivada Amarnath: పవన్, చంద్రబాబు భేటీపై సెటైర్.. సంక్రాంతి మామూళ్ల కోసమట!
Also Read
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ఇంకా చంద్రబాబే సభలతో పోలీస్ వ్యవస్థ మీద దాడులు చేయించాడని జోగి రమేశ్ ఆరోపణలు చేశారు. తనకు అసలు ఎదురే లేదన్నట్టుగా.. రోడ్ల వెంట చంద్రబాబు తిరిగారని ఆగ్రహించారు. ‘‘నాకు ఎంత ప్యాకేజ్ ఇస్తావ్, ఎన్ని సీట్లు ఇస్తావ్, నేనెక్కడ అమ్ముడుపోవాలి?’’ అనే విషయాలు మాట్లాడటం కోసమే.. దత్తతండ్రి ఇంటికి దత్తపుత్రుడు వెళ్లాడని వ్యాఖ్యానించారు. బయట మాత్రం జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తారని, లోపల మాత్రం ప్యాకేజ్ వ్యవహారాలే నడుస్తాయని, ఈ విషయాలు తమకు బాగా తెలుసని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని.. కానీ ఈ ప్రభుత్వాన్ని ఎలా అస్థిరపరచాలన్న దురుద్దేశంతో కుట్రలు పన్నుతున్నారన్నారు. అయితే.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ప్రజలు ఎన్నుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ని ఒక అంగుళం కూడా కదల్చలేరన్నారు. ఒక పార్టీకి లీడర్ అయిన పవన్ కల్యాణ్.. కందుకూరులో ఎనిమిది మంది, గుంటూరులో ముగ్గురు చనిపోతే ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
School Principal Offer: విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపాల్ బంపర్ ఆఫర్.. ఏంటంటే?
పవన్, చంద్రబాబులకు ప్రజా సమస్యలేమీ పట్టలేదని.. కేవలం దోచుకోవడం మీదే దృష్టంతా అని జోగి రమేశ్ పేర్కొన్నారు. 2014 నుంచి 2019 దాకా వాళ్లిద్దరు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి, పవన్ కల్యాణ్‌లకు ఓటమి తప్పదని.. ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని థీమా వ్యక్తం చేశారు. మీరిద్దరు కలిసొచ్చినా.. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రజలు తీర్పు ఇస్తారని నమ్మకం వెలిబుచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కి 175 సీట్లు గెలిచి.. విజయ దుందుభి మోగిస్తుందని జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?