Minister Gudivada Amarnath: గత ప్రభుత్వం నాలుగు సమ్మిట్లను నిర్వహించింది.. అయినా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు లేవని ఆరోపించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. అయితే, తాము అలా కాదు.. రాష్ట్రానికి లక్షా 87 కోట్ల పైబడే పెట్టుబడులు వచ్చేలా చూస్తున్నామని తెలిపారు.. విశాఖ వేదికగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు నాలుగువేల ఎనిమిది వందల రిజిస్ట్రేషన్లు వచ్చాచని వెల్లడించారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వచ్చెనెలలో జరుగుతుంది.. కోవిడ్ నేపధ్యంలో ఎటూ వెళ్లలేని పరిస్థితులు చూశాం.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలను ఎగ్జిబిట్ చేయాలని ఈ సమ్మిట్ ఏర్పాటు చేశామన్నారు.. ఢిల్లీలో 49 దేశాల ప్రతినిధులుతో సమావేశం ఏర్పాటు చేశాం.. టాటా రిలయన్స్, మహీంద్రా, ఇందుజా వంటి అధినేతలకు ఆహ్వానం పంపామని తెలిపారు.
Read Also: Buggana Rajendranath Reddy: ఐదు లక్షల ఉద్యోగాల కల్పనే టార్గెట్.. 20,000 కొత్త ఎంఎస్ఎంఈలు..
14 సెక్టార్లను ఎన్నుకున్నాం.. పారిశ్రామిక అభివృద్ధి, అవకాశాలను మనం పారిశ్రామికవేత్తలకు వివరించగలిగితే బాటుందని సీఎం జగన్ చెప్పారని తెలిపారు మంత్రి అమర్నాథ్.. అరవై దేశాల వారి పరిశ్రమలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారు.. వసతల కల్పనలో కేంద్రం నిర్వహించిన సర్వేలో 97 శాతంతో తొలి స్థానంలో ఉన్నామని ఆనందం వ్యక్తం చేశారు.. 11 ఇండ్రస్ట్రీయల్ కారిడార్స్ దేశ వ్యాప్తంగా పెడుతుంటే అందులో మూడు మన రాష్ట్రంలో ఉన్నాయన్న ఆయన.. ఎంఎస్ఎం యూనిట్లకు చేయూతని ఇచ్చి ఆదుకున్నాం అన్నారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ పరిసరాలలో ఐటీ టవర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. పోర్టుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని చెప్పబోతున్నాం అని ప్రకటించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.