కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రి వెంట ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా ఉన్నారు. ఈ భేటీలో కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటుపై చర్చ జరిగింది. గతవారం సీఎం పర్యటనతో “పెట్రో కెమికల్ కారిడార్” ఏర్పాటుకు కేంద్రం సత్వర చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , పెట్రోలియం సెక్రటరీలు చర్చించి ఈ అంశంపై ఒక ప్రణాళిక రూపొందిచారు. వీలైనంత త్వరలో రాష్ట్రంలో “పెట్రో కెమికల్ కారిడార్” ఏర్పాటు చేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి తెలిపినట్లు సమాచారం. “పెట్రో కెమికల్ కారిడార్”తో రాష్ట్రంలో 50 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. అలాగే రాష్ట్రంలో “గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ” ఏర్పాటుతో ఇథనాల్ ఉత్పత్తికి కేంద్రం సుముఖతంగా ఉందని… ఇథనాల్ ఉత్పత్తి ప్లాంట్లకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని మంత్రి చెప్పారు.