ఏపీకి వరంలా భావించే పోలవరం పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ పోలవరంలో పర్యటించారు. పోలవరం పనుల తీరుని ఆయన పరిశీలించారు. గోదావరి వరద పూర్తిగా తగ్గడంతో ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయ్యాయి..పనులు మరింత వేగవంతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ముందుగా లోయర్ కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభిస్తాం.. డయాఫ్రమ్ వాల్ వద్ద వున్న నీటిని పూర్తిగా తొలగించి వాల్ పరిస్థితి పై పరీక్షలు నిర్వహించాల్సి వుందన్నారు మంత్రి అంబటి రాంబాబు.
Read ALso: IBS College: షాకింగ్ అప్‌డేట్.. ఆ మెసేజ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ లు వైరల్
డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కొత్తది చేయాలా లేక వున్నదానిపై ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్ నిర్మాణం చేయాలా అనే నిర్ణయం తీసుకుంటాం.. ప్రాజెక్ట్ లో ప్రధానమైనవి స్పిల్ వే పూర్తి అయింది.. మరో ప్రధానమే ECRF ఈ ఏడాది ప్రారంభిస్తాం అని చెప్పారు మంత్రి అంబటి. ఇదిలా ఉంటే.. పోలవరం నిర్మాణం వల్ల ముంపునకు గురవుతున్న ప్రాంతాలను ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు సందర్శించారు.
Read Also: Special Focus On Cardiac Arrests Live: జిమ్ లు ప్రాణాలు తీస్తున్నాయా?
ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని బూర్గంపాడు, అశ్వా పురం, భద్రాచలం మండలాల్లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై కేంద్ర జలవనరుల సంఘం స్పందించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాలను పరిశీలించి నివేదిక అందించాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో పర్యటించారు. త్వరలోనే మరోసారి సర్వే నిర్వహించనున్నారు.