యాస్ తుపాన్ ప్రభావిత జిల్లాల జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసారు మంత్రి ఆళ్ల నాని. తుపాన్ కదలికలపై ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించిన మంత్రి ఆళ్ల నాని… విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లాల DMHO లు DCHS, హాస్పిటల్ సూపరింటెండెంట్స్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ ముందుగా సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేసారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు వల్ల ఎలాంటి అంటు వ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. తుపాన్ సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు పరిధిలో డాక్టర్స్, వైద్య సిబ్బంది హాస్పిటల్స్ లో అందుబాటులో ఉండాలి. స్పెషలిస్ట్ వైద్యులతో రాపిడ్ రెస్పాన్స్ మెడికల్ టీమ్స్ కూడసిద్ధం చేసుకోవాలని తెలిపారు.
ప్రత్యేకంగా మెడికల్ బృందాలను కూడ అందుబాటులో ఉంచుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపు లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. తుపాన్ ప్రభావం కారణంగా వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆళ్ల నాని DMHO లకు తెలిపారు. ప్రతి మూడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు పరిధిలో ఒక స్పెషల్ మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో శానిటేషన్, త్రాగునీరు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని… అత్యవసరంగా వైద్య సేవలు అవసరం అనుకున్న చోటకు సీనియర్ వైద్యులతో టీమ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జాతి చేసారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు RD కిట్స్, ఇతర మందులు అందుబాటులో ఉంచాలి. తుపాన్ ప్రభావిత ప్రాంతంలో ప్రతి రిలీఫ్ కేంద్రం వద్ద ఒక ANM, MPHA సూపర్ వైజర్ ఆశా వర్కర్లు తో మెడికల్ క్యాంపు తక్షణమే ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. అత్యవసరంగా వైద్య సేవలు అందించడానికి 104,108అంబులెన్సు లు సిద్ధం చేసుకోవాలని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.