Mekapati Chandrasekhar Reddy: రాజీనామాకు రెడీ.. మేకపాటి ఓపెన్ చాలెంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mekapati Chandra Sekhar Reddy: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెంచాయి.. 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఇందులో 6 స్థానాలు వైసీపీ, మరోస్థానాన్ని అనూహ్యంగా టీడీపీ కైవసం చేసుకుంది. ఏడింటికి ఏడు స్థానాలు నెగ్గుతామని ధీమాగా ఉన్న వైసీపీ నాయకత్వానికి ఈ పరిణామం షాక్ ఇచ్చింది.. ఇక, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇదే సమయంలో.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు, రూ.20 కోట్లు ఇచ్చారని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు. నాకు ఇచ్చిన లిస్ట్ ప్రకారం.. వైసీపీ అభ్యర్థికే ఓటు వేశా.. నేను ఓటు వేసిన అభ్యర్థి విజయం సాధించారు.. కానీ, రహస్య బాలెట్‌లో జరిగిన విధానంలో.. నేను ఓటు వేయలేదని ఎలా గుర్తించారని మండిపడ్డారు..
నన్ను సస్పెండ్ చేశారు.. ఎమ్మెల్యే పదవి కూడా మా పార్టీ వల్ల వచ్చిందని అంటున్నారు.. గనుక నేను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.. నేను రాజీనామా చేసిన వెంటనే ఎన్నికలు పెట్టేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. ఇక, వైసీపీ ఆరోపించినట్టు.. నేను కటప్పను కాను.. జగన్ దగ్గరే చాలా మంది కట్టప్పలు ఉన్నారన్నారు.. అందరికీ దేవుడు ఉన్నాడు.. నన్ను ఎంతో క్షోభపెట్టారు.. గుండెపోటు వచ్చేలా టెన్షన్ పెట్టారని ఆరోపించారు. నా నియోజకవర్గంలో ఎంతో మందిని దించారు.. ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇచ్చేది లేదన్నారు.. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు.. కానీ, అది అయ్యేది ఎప్పుడో అన్నారు.. కానీ, నేను ఎలాంటి డిమాండ్ చేయలేదు.. మంత్రి పదవి అడగలేదు.. ఎలాంటి పదవి కావాలని అడగలేదు.. ఒకవిధంగా నేను సీరియస్‌ని.. మంత్రి పదవి ఇస్తే నాకే ఇవ్వాల్సి ఉండే.. కానీ, మా సోదరుడి కుమారుడు గౌతమ్‌కు ఇచ్చారు.. అయినా సంతోషమే.. కానీ, ఆయన టైం సరిగాలేక కాలం చేశారని వ్యాఖ్యానించారు. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసిన మేకపాటి.. ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
Also Read
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- OTR : ఇంటింటికీ టీడీపి.. గోదావరి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేల గందరగోళం
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్‌లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!