AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AB Venkateswara Rao: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి అందరు అభ్యర్థులు తమ ప్రయత్నాల్లో ఉన్నారు.. ఇక, జనసేన అభ్యర్థిగా బెజవాడ మేయర్ బరిలోకి దిగిన వంగవీటి రాధాపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, విజయవాడ మేయర్ స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా తనకు 20 ఏళ్లుగా పరిచయమని తెలిపారు. రాధా తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో తాను విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేశానని గుర్తుచేశారు. ఆ తర్వాత తాను ఎక్కడికి వెళ్లినా రాధాతో పరిచయం కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో తాను వంగవీటి రాధా గురించి ఒక్క పరుషమైన మాట కూడా మాట్లాడనని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. రాధా కూడా తన గురించి పరుషంగా మాట్లాడరని అన్నారు. తమ మధ్య ఉన్నది రాజకీయ సమరమే తప్ప వ్యక్తిగత పోరాటం కాదని వివరించారు. కొందరు కావాలనే తమ మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెంత రెచ్చగొట్టినా తాము రెచ్చిపోయే వాళ్లం కాదని స్పష్టం చేశారు.
Also Read
- Mydukur Election Suspended: మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు రద్దు.. ఎస్ఈసీ కీలక ప్రకటన
- AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్.. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో కీలక భేటీ
- AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
- CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
విజయవాడ నగర మేయర్ విషయంలో నగర ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడ వంటి నగరానికి నాయకత్వం వహించే అవకాశం రాకపోయినా, మేయర్ పదవికి పోటీ చేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. తాము డీజే కూడా లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని, నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కొద్ది రోజుల సమయం మాత్రమే ఇచ్చిందని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నిర్ణయం ఏమీ లేదని, అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే జరుగుతోందని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!